తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Fmcg Stock: ఐదేళ్లలో 400 శాతం పెరిగిన మల్టీ బ్యాగర్ స్టాక్..

Multibagger FMCG stock: ఐదేళ్లలో 400 శాతం పెరిగిన మల్టీ బ్యాగర్ స్టాక్..

HT Telugu Desk HT Telugu

27 April 2023, 16:02 IST

    • Multibagger FMCG stock: ఎఫ్ఎంసీజీ (FMCG) రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న మిస్టాన్ ఫుడ్స్ (Mishtann Foods) సంస్థ భారతీయ స్టాక్ మార్కెట్లో మరో మల్టీ బ్యాగర్ స్టాక్ గా నిలిచింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Multibagger stock: గత కొన్ని ఏళ్లుగా మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. ఈ స్మాల్ క్యాప్ ఎఫ్ఎంసీజీ సంస్థ షేర్ విలువ గత ఐదేళ్లలో 400% పెరిగింది.

Multibagger FMCG stock: మల్టీ బ్యాగర్ స్టాక్

మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) కు చెందిన ఒక్కో ఈక్విటీ షేర్ విలువ ఐదేళ్ల క్రితం రూ. 1. 50 గా ఉండేది. ప్రస్తుతం ఆ సంస్థ షేర్ విలువ రూ. 7.52. అంటే సుమారు 400% వృద్ధిని సాధించి మరో మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ (Multibagger stock) గా మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) నిలిచింది. ఒకానొక సమయంలో ఈ సంస్థ షేర్ విలువ 52 వారాల గరిష్టమైన రూ. 14. 35 లకు కూడా చేరింది. పెన్నీ స్టాక్స్ పై పెట్టుబడులు పెట్టడం కొంతవరకు రిస్క్ అయినా, ధైర్యం చేసి ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలను మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) అందించింది.

Multibagger FMCG stock: యూఏఈ సంస్థ విలీనం

ఇటీవల మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్() కు చెందిన “Grow and Grub Nutrients FZ – LLC” సంస్థను విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించడానికి భూమిక ను సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ మార్కెట్ కు విస్తృత అవకాశాలున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. యూఏఈ కి చెందిన “Grow and Grub Nutrients FZ – LLC” ను విలీనం చేసుకోవడం తమ సంస్థ అభివృద్ధిలో పెద్ద మైలు రాయి అని మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) ఎండీ హితేశ్ పటేల్ తెలిపారు. ఈ విలీనం ద్వారా తమ కస్టమర్ బేస్ మరింత పెరుగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లో అగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో తమ బ్రాండ్ పాపులారిటీ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

Multibagger FMCG stock: బీఎస్ఈ లో అందుబాటులో..

మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) షేర్ ట్రేడింగ్ బీఎస్ఈ (BSE) లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సంస్థ 52 వారాల గరిష్టం రూ. 14.35 కాగా, 52 వారాల కనిష్టం రూ. 7.15. మిస్తాన్ ఫుడ్స్ (Mishtann Foods) మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 375 కోట్లు.

తదుపరి వ్యాసం