తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Windows 11 Update: కృత్రిమ మేథతో కో పైలట్; విండోస్ 11 అప్ డేట్ లో కొత్త ఫీచర్సెన్నో..

Windows 11 Update: కృత్రిమ మేథతో కో పైలట్; విండోస్ 11 అప్ డేట్ లో కొత్త ఫీచర్సెన్నో..

HT Telugu Desk HT Telugu

27 September 2023, 12:52 IST

  • Windows 11 new features: మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ గా విండోస్ 11 అప్ డేట్ ను రిలీజ్ చేసింది. ఇందులో విప్లవాత్మక మార్పలను చాలా చేసింది. ముఖ్యంగా కృత్రిమ మేథ ఆధారిత కోపైలట్ (Copilot) అసిస్టెంట్ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

Windows 11 new features: విండోస్ 11 అప్ డేట్ తో ఎన్నో సరికొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాటిలో ప్రధానంగా కృత్రిమ మేథ ఆధారిత కోపైలట్ (Copilot) అసిస్టెంట్ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ట్రెండింగ్ వార్తలు

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

దాదాపు 150 కొత్త ఫీచర్లు

విండోస్ 11 అప్ డేట్ లోని ‘కో పైలట్ అసిస్టెంట్ (Copilot assistant)’ తో యూజర్ల పని చాలా తేలిక కానుంది. యూజర్లు తమ టాస్క్ లను మరింత వేగంగా పూర్తి చేయగలుగుతారు. యూజర్లకు కో పైలట్ నుంచి పర్సనలైజ్డ్ జవాబులు లభిస్తాయి. దాంతో, యూజర్ల సమయం చాలా ఆదా అవుతుంది. ప్రైవసీ, సెక్యూరిటీ ల విషయంలోనూ ఈ కో పైలట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇది విండోస్ 11, మైక్రో సాఫ్ట్ 365, మైక్రో సాఫ్ట్ ఎడ్జ్, బింజ్ ల్లో అందుబాటులో ఉంటుంది. విండోస్ 11 అప్ డేట్ లో సమారు 150 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కో పైలట్ అసిస్టెంట్ మాత్రమే కాకుండా, కృత్రిమ మేథ సహాయంతో ఎంఎస్ పెయింట్, ఫొటోస్, క్లిప్ చాంప్ తదితర యాప్ లను మరింత మెరుగుపర్చారు.

మెరుగుపర్చిన పెయింట్

ఎంఎస్ పెయింట్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మెరుగుపర్చారు. ఇప్పుడు ఈ యాప్ తో డ్రాయింగ్, డిజిటల్ క్రియేషన్ మరింత సులువవుతుంది. బ్యాక్ గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్ కూడా వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, ఇకపై పెయింట్ యాప్ తో కో క్రియేటర్ కూడా యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా సృజనాత్మక చిత్రాలను రూపొందించవచ్చు.

స్నిపింగ్ టూల్

విండోస్ 11 లోని మరో అప్ డేటెట్ ఫీచర్ స్నిపింగ్ టూల్. దీనిద్వారా స్క్రీన్ రికార్డింగ్ మరింత ఈజీ అవుతుంది. విండోస్ + షిఫ్ట్ + ఆర్ (Windows + Shift + R) ను ఒకేసారి ప్రెస్ చేయడం ద్వారా స్క్రీన్ రికార్డింగ్ ను ప్రారంభించవచ్చు. ఫొటోస్ యాప్ ను కూడా విండోస్ 11 లో అప్ గ్రేడ్ చేవారు. కృత్రిమ మేథ సాయంతో ఫోటోస్ యాప్ లో బ్యాక్ గ్రౌండ్ బ్లర్, ఇంప్రూవ్డ్ సెర్చ్ లను మెరుగుపర్చారు.

తదుపరి వ్యాసం