తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Jimny 5-door Suv: మారుతీ జిమ్నీ 5-డోర్ వెర్షన్ ఇండియాకు వచ్చేస్తోందా? మహీంద్రా థార్‌కు పోటీగా..

Maruti Jimny 5-Door SUV: మారుతీ జిమ్నీ 5-డోర్ వెర్షన్ ఇండియాకు వచ్చేస్తోందా? మహీంద్రా థార్‌కు పోటీగా..

20 December 2022, 18:38 IST

    • Maruti Jimny 5-Door SUV: జిమ్నీ ఫైవ్-డోర్ ఎస్‍యూవీని మారుతీ సుజుకీ ఇండియాలో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ ఆఫ్‍రోడ్ ఎస్‍యూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా లీకైంది. వివరాలివే..
Maruti Jimny 5-door SUV: మారుతీ జిమ్నీ 5-డోర్ వెర్షన్ ఇండియాకు వచ్చేస్తోందా? (Photo: Instagram / Deepak Thakur)
Maruti Jimny 5-door SUV: మారుతీ జిమ్నీ 5-డోర్ వెర్షన్ ఇండియాకు వచ్చేస్తోందా? (Photo: Instagram / Deepak Thakur)

Maruti Jimny 5-door SUV: మారుతీ జిమ్నీ 5-డోర్ వెర్షన్ ఇండియాకు వచ్చేస్తోందా? (Photo: Instagram / Deepak Thakur)

Maruti Jimny 5-Door SUV launch: మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్వరలో ఇండియాలో ఫైవ్-డోర్ వెర్షన్ జిమ్నీ ఎస్‍యూవీని లాంచ్ చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా ఎస్‍యూవీలకు పోటీని ఇచ్చే విధంగా ఇది అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భారత్‍లో 5-డోర్ జిమ్నీ ఎస్‍యూవీని మారుతీ టెస్ట్ చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పో (Auto Expo 2023) లో దీన్ని మారుతీ సుజుకీ ఆవిష్కరిస్తుందని సమాచారం. తాజాగా కామోఫ్లాజ్ లేకుండా తొలిసారి ఈ ఎస్‍యూవీని టెస్ట్ చేయటంతో ఇండియాలో లాంచ్ కావడం పక్కా అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మారుతీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ ఫస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫస్ట్ లుక్‍ ద్వారా కొన్ని వివరాలు కూడా తెలుస్తున్నాయి.

వచ్చే నెలలోనే!

Maruti Suzuki Jimny 5-Door SUV: వచ్చే ఏడాది ఎక్కువ సంఖ్యలో కొత్త ఎస్‍యూవీ మోడళ్లను లాంచ్ చేసేందుకు మారుతీ సుజుకీ ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలో వచ్చే నెల (2023 జనవరి) జరిగే ఆటో ఎక్స్‌పోలో కనీసం రెండు ఎస్‍యూవీలనైనా ఆవిష్కరించనుందని సమాచారం. దీంట్లో ఈ 5-డోర్ జిమ్నీ ఎస్‍యూవీ కూడా ఉండనుంది. ఇప్పటికే త్రీ-డోర్ జిమ్నీ వెర్షన్‍ను సుజుకీ కొన్ని గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తోంది. అయితే ఈసారి ఈ 5-డోర్ వెర్షన్ జిమ్నీ ఎస్‍యూవీని ఇండియాలో లాంచ్ చేయాలని మారుతీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కెనటిక్ ఎల్లో బాడీ కలర్, మ్యాచింగ్ డోర్ హ్యాండిళ్లతో ఉన్న ఫైర్-డోర్ జిమ్నీ మోడల్ ఫొటో తాజాగా బయటికి వచ్చింది. లాంగ్ వీల్ బేస్, పెద్ద బంపర్లు, ఓఆర్వీఎంలు ఉన్నాయి. సైడ్ క్లాడింగ్స్ బ్లాక్ ప్లాస్టిక్‍తో ఉన్నాయి. ఈ ఎస్‍యూవీ సైడ్‍కు ఎలాంటి టైలింగ్ లైట్స్ లేవని ఈ లుక్ ద్వారా తెలుస్తోంది.

త్రీ-డోర్ వెర్షన్ కంటే ఈ నయా ఫైవ్-డోర్ వెర్షన్ జిమ్నీ ఎస్‍యూవీ వీల్ బేస్ ఎక్కువగా ఉండటంతో లోపల స్పేస్‍ కూడా అధికంగా ఉండనుంది. 2,550mm వీల్ బేస్ ఉండే అవకాశం ఉంది. 3-డోర్ వెర్షన్ కంటే ఇది 300mm ఎక్కువ. ఇక ఈ ఎస్‍యూవీ పొడవు 4 మీటర్ల లోపే ఉంటుందని అంచనా. వెనుక డోర్ హ్యాండిళ్లు సైడ్‍వేస్‍గా ఓపెన్ అవుతాయి. ఇక ఈ ఎస్‍యూవీ రెండో వరుస.. బెంచ్ సీట్లను కలిగి ఉంటుంది.

జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీలో కొత్త జనరేషన్ కే15బీ సిరీస్ ఇంజిన్‍ను మారుతీ పొందుపరిచే అవకాశం అధికంగా ఉంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో ఈ ఇంజిన్ వస్తుందని అంచనా. ఆల్ గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఉంటుందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం