తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Retail Inflation Surges: సెప్టెంబరులో 7.41 శాతానికి పెరిగిన ద్రవ్యోల్భణం

retail inflation surges: సెప్టెంబరులో 7.41 శాతానికి పెరిగిన ద్రవ్యోల్భణం

HT Telugu Desk HT Telugu

12 October 2022, 17:52 IST

    • retail inflation surges: సెప్టెంబరు మాసంలో రీటైల్ ఇన్‌ఫ్లేషన్ 7.41 శాతానికి పెరిగింది.
సెప్టెంబరులో పెరిగిన రీటైల్ ద్రవ్యోల్భణం
సెప్టెంబరులో పెరిగిన రీటైల్ ద్రవ్యోల్భణం

సెప్టెంబరులో పెరిగిన రీటైల్ ద్రవ్యోల్భణం

భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.41 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎగువ సహన పరిమితి కంటే ఎక్కువగా నమోదవడం వరుసగా తొమ్మిదో నెల ఇది.

ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నాలుగుసార్లు కీలకమైన రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా ద్రవ్యోల్భణ గణాంకాలు వడ్డీ రేట్ల పెంపును మరింత తీవ్రతరం చేసేలా ప్రభావం చేయనున్నాయి.

కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్‌లో దాదాపు సగం వాటా కలిగిన ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.62% నుండి సెప్టెంబర్ 2022లో 8.60 శాతానికి పెరిగింది.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) ద్వారా కొలిచే పారిశ్రామిక వృద్ధి జూలైలో 2.4 శాతంగా ఉండగా ఆగస్టులో 0.8 శాతం పెరిగింది.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా సప్లై చైన్ అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు గత రెండేళ్లుగా పెరిగాయి.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి బియ్యంపై కొన్ని ఎగుమతి పరిమితులు విధించింది. అలాగే ధరలను తగ్గించడానికి భారత ప్రభుత్వం పలు చర్యలను అమలు చేసింది.

మరోవైపు బలహీనపడుతున్న కరెన్సీ రూపాయి రోజురోజుకు కొత్త జీవిత కాలపు కనిష్టాలను నమోదు చేస్తోంది. ఇది ద్రవ్యోల్భణం తగ్గడంలో సహాయపడదు.

ఇక ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ స్టడీస్ విభాగం అధిపతి మంగళవారం ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘2023-2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సహన స్థాయికి తిరిగి వస్తుందని మేం భావిస్తున్నాం..’ అని అంచనా వేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం