తెలుగు న్యూస్  /  Business  /  Hyundai Creta N Line To Launch On March 11. Check Details

Hyundai Creta N Line: మార్చి 11 న హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంచ్; ధర, ఫీచర్స్, ఇతర వివరాలు..

HT Telugu Desk HT Telugu

23 February 2024, 17:45 IST

    • Hyundai Creta N Line: క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీని హ్యుందాయ్ ఈ మార్చి 11వ తేదీన భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ క్రెటా ఎన్ లైన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. అలాగే, ఇందులో  6-స్పీడ్ యూనిట్ గేర్ బాక్స్, 7-స్పీడ్ డీసీటీ ఉన్నాయి.
 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీ
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీ

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీ

Hyundai Creta N Line: 2024 ను మోటార్ ఇండియా లిమిటెడ్ క్రెటా విడుదలతో ప్రారంభించింది. క్రెటా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే 60,000 బుకింగ్ లను పొందింది. ఇప్పుడు, క్రెటా ఎన్ లైన్ వెర్షన్ లాంచ్ చేయడానికి హ్యుందాయ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రెటా ఎన్ లైన్ ను మార్చి 11 న ఆవిష్కరించనున్నట్లు హ్యుందాయి ప్రకటించింది. ఈ ఎస్యూవీ ఫొటోలు, స్పై షాట్లు ఇప్పటికే లీకయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

How to withdraw EPF balance : ఆన్​లైన్​లో ఈపీఎఫ్​ డబ్బులను ఇలా విత్​డ్రా చేసుకోండి..

Gold and silver prices today : పసిడి పరుగుకు బ్రేక్​- తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు ఇలా..

Gadgets under 699: ‘‘వర్క్ ఫ్రం హోం’’ చేస్తున్నారా?.. ఈ ఐదు గాడ్జెట్స్ చాలా యూజ్ ఫుల్

FD interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు లభించేది ఇక్కడే..; అత్యధికంగా 8.8 శాతం వరకు..

1.5-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ 1.5-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 5,500 ఆర్ పిఎమ్ వద్ద 158 బిహెచ్ పి పవర్, 1,500 - 3,500 ఆర్ పిఎమ్ వద్ద 253 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ యూనిట్ గేర్ బాక్స్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ యూనిట్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీతో మాత్రమే అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లో కొన్ని యాంత్రిక మార్పులను చేశారు. ముఖ్యంగా సస్పెన్షన్ ను మరింత మెరుగుపర్చారు.

కాస్మెటిక్ చేంజెస్..

వీటితో పాటు హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లో కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేశారు. కొత్త బంపర్లతో స్పోర్టియర్ లుక్ ఉన్న ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ ను రూపొందించారు. కొత్త డిజైన్ లో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. హ్యుందాయ్ డ్యూయల్-టోన్ పెయింటెడ్ రూఫ్ ఆప్షన్లతో కొత్త కలర్ స్కీమ్ లను అందిస్తుంది. కొత్త మ్యాట్ కలర్ కూడా లభిస్తుంది. రియర్ స్పాయిలర్, ఎన్ లైన్ బ్యాడ్జింగ్ మరియు వెనుక భాగంలో ఫాక్స్ డిఫ్యూజర్ ఉన్నాయి.

ఇంటీరియర్ లుక్

ఇంటీరియర్ కూడా స్పోర్టీ టచ్ తో అప్ డేట్ చేశారు. కొత్త డిజైన్ లో లెదర్ కవర్ తో ఎన్ లైన్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. డ్యాష్ బోర్డుపై రెడ్ ఇన్సర్ట్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా ఎరుపు బెజెల్ తో ఉంటుంది. అలాగే, క్రెటా ఎన్ లైన్ వెర్షన్లకు ప్రత్యేకమైన కొత్త గేర్ లివర్ ను ఏర్పాటు చేశారు.