తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Personal Loan: పర్సనల్ లోన్ ఇబ్బంది పెడుతోందా? ఈ టెక్నిక్స్ తో త్వరగా తీర్చేయండి..

personal loan: పర్సనల్ లోన్ ఇబ్బంది పెడుతోందా? ఈ టెక్నిక్స్ తో త్వరగా తీర్చేయండి..

HT Telugu Desk HT Telugu

02 April 2024, 18:07 IST

  • Personal loan: వివిధ అవసరాలకు బ్యాంక్ లు, లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి వివిధ రకాలైన రుణాలు తీసుకుంటూ ఉంటాం. వాటిలో అత్యంత సాధారణమైనది, సులభంగా పొందగలిగేది పర్సనల్ లోన్. సాధారణంగా ఈ లోన్ వడ్డీ రేటు కొంత ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ రుణాన్ని త్వరగా తీర్చేయడం బెటర్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Personal loan: డబ్బులు అత్యవసరమైనప్పుడు, అత్యంత సులువుగా, తొందరగా పొందగలిగేవి వ్యక్తిగత రుణాలు. అప్పు తీర్చగల సామర్ధ్యాన్ని చూసి బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్స్ ఇస్తుంటాయి. ఈ లోన్ పొందడానికి పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేదు. హోం లోన్, వెహికిల్ లోన్ తరహాలో పర్సనల్ లోన్ ప్రత్యేక అవసరానికి ఉద్దేశించినది కాదు. పర్సనల్ లోన్ ద్వారా పొందిన డబ్బును ఏ అవసరానికైనా వాడుకోవచ్చు. అయితే, ఈ పర్సనల్ లోన్ కు చెల్లించే వడ్డీ.. వాహన రుణం, లేదా హోం లోన్ వంటి రుణాల వడ్డీ రేట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వ్యక్తిగత రుణాన్ని మరింత త్వరగా చెల్లించడం మంచిది. అందుకు గానూ ఈ టెక్నిక్స్ ఫాలో కావచ్చు.

ట్రెండింగ్ వార్తలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

ఈ టెక్నిక్స్ తో త్వరగా పర్సనల్ లోన్ తీర్చేయండి

  • ఈఎంఐగా రెగ్యులర్ గా చెల్లించే మొత్తం కన్నా ఎక్కువ చెల్లించండి. ప్రతి నెలా వీలైనంత మొత్తాన్ని ఈఎంఐకి జోడించడం వల్ల మీరు చెల్లించాల్సిన మొత్తంతో పాటు దానికి చెల్లించే వడ్డీ గణనీయంగా తగ్గుతుంది.
  • వీలైతే, నెలలో ఒకసారి కన్నా ఎక్కువసార్లు చెల్లింపులు చేయండి. కొన్ని బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు వారానికి రెండుసార్లు కూడా చెల్లించేందుకు అనుమతిస్తారు. ఇది సంవత్సరం పొడవునా మీ చెల్లింపుల ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. తద్వారా లోన్ మొత్తాన్ని త్వరగా చెల్లించడం వీలు అవుతుంది.
  • ఈఎంఐ మొత్తాన్ని పెంచేందుకు వీలుగా ఇతర ఖర్చులను తగ్గించండి. రెగ్యులర్ గా మీ బడ్జెట్ ను సమీక్షించండి. అనవసర ఖర్చును తగ్గించి, ఆ మొత్తాన్ని పర్సనల్ లోన్ చెల్లించడానికి ఉపయోగించండి.
  • అధిక వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం ఉంటే, తక్కువ రేటును అందించే వేరే రుణదాతతో రీఫైనాన్సింగ్ కు అవకాశం ఉందేమో చూడండి. ఇది మీ వడ్డీ ఖర్చును బాగా తగ్గిస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధిని కూడా తగ్గిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు - సమాధానాలు

  • ప్ర. పర్సనల్ లోన్ ను ముందుగానే చెల్లించడానికి సంబంధించిన ప్రీ-క్లోజర్ పెనాల్టీ ఎంత?

రుణాన్ని షెడ్యూల్ కంటే ముందుగా సెటిల్ చేయాలనుకున్నప్పుడు అనేక బ్యాంకులు ప్రీ-పేమెంట్ పెనాల్టీని విధిస్తాయి. ఈ జరిమానాను సాధారణంగా బకాయి ఉన్న రుణ నిల్వ లేదా ముందస్తు చెల్లింపు కారణంగా రుణదాత కోల్పోయే వడ్డీ శాతం ఆధారంగా లెక్కిస్తారు. సాధారణంగా, ప్రీ-పేమెంట్ పెనాల్టీ రుణంగా తీసుకున్న మొత్తంలో 2% నుండి 5% వరకు ఉంటుంది.

  • పర్సనల్ లోన్ త్వరగా తిరిగి చెల్లించడం కొరకు ఎలాంటి డాక్యుమెంట్ లు అవసరం అవుతాయి?

రుణాన్ని త్వరగా చెల్లించాలనుకున్నప్పుడు ఈ కింది డాక్యుమెంట్స్ అవసరమవుతాయి.

రుణదాతకు అందించాల్సిన పత్రాలు:

  • కేవైసీ డాక్యుమెంట్స్
  • లోన్ డాక్యుమెంట్
  • ఈఎంఐ పేమెంట్ కు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్
  • ప్రి పేమెంట్ స్టేట్మెంట్

రుణాన్ని తీర్చే సమయంలో తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్

  • పర్సనల్ లోన్ క్లోజర్ కొరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)
  • పర్సనల్ లోన్ క్లోజర్ సర్టిఫికేట్
  • చెల్లింపు డ్యూ సర్టిఫికేట్

ప్ర. రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించడం మీ క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందా?

స్థిరమైన ఆన్-టైమ్ చెల్లింపులు చేయడం, రుణాన్ని త్వరగా చెల్లించడం మీ క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. భవిష్యత్తు రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం