తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Broadband: చీపెస్ట్ ప్లాన్‍ను తొలగించిన బీఎస్ఎన్ఎల్.. ఉచిత ఇన్‍స్టాలేషన్ ఆఫర్ కొనసాగింపు

BSNL Broadband: చీపెస్ట్ ప్లాన్‍ను తొలగించిన బీఎస్ఎన్ఎల్.. ఉచిత ఇన్‍స్టాలేషన్ ఆఫర్ కొనసాగింపు

20 January 2023, 12:55 IST

    • BSNL Broadband: భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్‍లో తక్కువ ధర ప్లాన్‍ను బీఎస్ఎన్ఎల్ తొలగించింది. దీంతో ఇప్పుడు రూ.399 చీపెస్ట్‌ ప్లాన్‍గా ఉంది. అలాగే ఉచిత ఇన్‍స్టాలేషన్, రూటర్ ఆఫర్లు ఈ ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
BSNL Broadband: చీపెస్ట్ ప్లాన్‍ను తొలగించిన బీఎస్ఎన్ఎల్
BSNL Broadband: చీపెస్ట్ ప్లాన్‍ను తొలగించిన బీఎస్ఎన్ఎల్ (HT_Photo)

BSNL Broadband: చీపెస్ట్ ప్లాన్‍ను తొలగించిన బీఎస్ఎన్ఎల్

BSNL Broadband: భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్‍ (Bharat Fibre Broadband) లో చీపెస్ట్ ప్లాన్‍ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తొలగించింది. ఎంట్రీ లెవెల్‍గా ఉన్న రూ.329 ప్లాన్‍ను తాజాగా రిమూవ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా నెలకు 20 ఎంబీఎస్‍ వేగంతో 1,000జీబీ డేటా లభించేంది. నెల ముగియకముందే 1000జీబీ డేటా అయిపోతే 2 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకునే సదుపాయం ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్‍ను బీఎస్‍ఎన్ఎల్ తొలగించింది. దీంతో ఇప్పుడు రూ.399 ప్లాన్ చీపెస్ట్ ఆప్షన్‍గా ఉంది. ప్రస్తుతం భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఉచిత ఇన్‍స్టలేషన్‍తో పాటు రూటర్‌ను కూడా ఫ్రీగా ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్ వివరాలు, ఇన్‍‍స్టాలేషన్ ఆఫర్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

బీఎస్‍ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.399 ప్లాన్

BSNL Broadband: రూ.329 ప్లాన్‍ను తొలగించాక బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్‍లో ప్రస్తుతం రూ.399 చీపెస్ట్ ప్లాన్‍గా ఉంది. హోమ్ వైఫై (BSNL 399 Plan) పేరుతో ఈ ప్లాన్ ఉంది. రూ.399 ప్లాన్ తీసుకుంటే నెలకు 30 ఎంబీపీఎస్ వేగంతో 1000జీబీ డేటా లభిస్తుంది. నెలలో ఈ డేటా అయిపోతే 4 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇక ల్యాండ్‍లైన్‍తో అన్‍లిమిడెట్ కాల్స్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‍లో ఇదే తక్కువ ధర బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍గా ఉంది. రూ.275 ప్రత్యేక ఆఫర్ ప్లాన్‍ను కూడా ఇటీవలే బీఎస్ఎన్ఎల్ తీసేసింది.

ఉచిత ఇన్‍స్టాలేషన్, రూటర్

BSNL Broadband: భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ కొత్త కనెక్షన్ తీసుకునే యూజర్లకు ఉచితంగా ఇన్‍స్టాలేషన్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ ఉచిత ఇన్‍స్టాలేషన్ ఆఫర్ ఉంటుందని పేర్కొంది. అంటే ఆలోగా కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న వారు ఇన్‍స్టాలేషన్‍కు చార్జీలు చెల్లించే అవసరం ఉండదు. ఇక వైఫై రూటర్లను కూడా బీఎస్ఎన్ఎల్ ఉచితంగా ఇస్తుంది. అయితే సింగిల్ బ్యాండ్ రూటర్ ఉచితంగా కావాలనుకునేవారు ఫైబర్ బేసిక్ (రూ.499), ఫైబర్ వాల్యూ (రూ.799), సూపర్ స్టార్ ప్రీమియమ్ ప్లస్ (రూ.999), ఫైబర్ ప్రీమియమ్ ప్లస్ ఓటీటీ (రూ.1499)ల్లో ఏదైనా ఓ ప్లాన్‍ను ఆరు నెలలు ఒకేసారి సబ్‍స్క్రైబ్ చేసుకోవాలి. డ్యుయల్ బ్యాండ్ రూటర్ ఉచితంగా కావాలంటే ఆ ప్లాన్‍లలో ఏదైనా ఒకదాన్ని 12 నెలలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం