తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Broadband Offers: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్‍ల గడువు పొడిగింపు.. అప్పటి వరకు ఛాన్స్!

BSNL Broadband offers: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్‍ల గడువు పొడిగింపు.. అప్పటి వరకు ఛాన్స్!

20 November 2022, 14:41 IST

    • BSNL Broadband offers: భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఫ్రీడమ్ ప్లాన్‍లను మరికొంత కాలం అందించనుంది బీఎస్ఎన్ఎల్. మూడు ప్లాన్‍ల తుది గడువును పెంచింది.
బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్‍ల గడువు పొడిగింపు (HT Photo)
బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్‍ల గడువు పొడిగింపు (HT Photo) (HT Photo)

బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్‍ల గడువు పొడిగింపు (HT Photo)

BSNL Broadband offers: మూడు ఆకర్షణీయమైన బ్రాండ్‍బ్యాండ్ ప్లాన్‍ల అందుబాటు గడువును బీఎస్ఎన్ఎల్ పొడిగించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్లాన్‍లను మరింత కాలం ఇవ్వనుంది. రెండోసారి ఈ భారత్ ఫైబర్ బ్రాండ్‍బ్యాండ్ ఫ్రీడమ్ ప్లాన్‍ల గడువును పెంచింది. నవంబర్ 15వ తేదీ వరకు ఈ మూడు ప్లాన్‍లను ఇస్తామని ముందుగా చెప్పిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో నెల రోజులు వీటిని ఉంచనుంది. రూ.275 ధరతో రెండు ప్లాన్స్ ఉండగా.. మరొకటి రూ.775 ప్లాన్. ఈ ప్లాన్‍లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

BSNL Bharat Fiber Broadband Freedom Plans: మరో నెల..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టులో తీసుకొచ్చిన రూ.275, రూ.775 భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లను డిసెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‍తో పాటు మరిన్ని సర్కిళ్లలో డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ ప్లాన్‍లు ఉంటాయని వెబ్‍సైట్‍లో పేర్కొంది. ఈ బ్రాండ్‍బ్యాండ్ ఆఫర్ ప్లాన్స్ కావాలనుకున్న వారు ఆలోగా రీచార్జ్ చేసుకోవచ్చు.

BSNL Broadband Rs.275 Freedom Plans: ఫ్రీడమ్ ఆఫర్స్ కింద రూ.275 ధరతో రెండు బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‍లను ఎంపిక చేసుకుంటే 75 రోజుల వ్యాలిడిటీతో 3,300జీబీ డేటా లభిస్తుంది. రెండు ప్లాన్‍లతో ఇవే బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఓ ప్లాన్‍తో 60 Mbps ఇంటర్నెట్ వేగం, మరో ప్లాన్‍తో 30 Mbps వేగం ఉంటుంది. వినియోగదారులు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే భారత్ ఫైబర్ వాడుతున్న వారు కూడా ఆఫర్ ప్లాన్‍లను తీసుకోవచ్చు.

BSNL Broadband Rs.775 Freedom Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.775 ఫ్రీడమ్ ప్లాన్‍ను ఎంపిక చేసుకుంటే కూడా 75 రోజుల కాలపరిమితి ఉంటుంది. 150 Mbps వేగంతో 2000జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+ హాట్‍స్టార్, సోనీ లివ్, జీ5 వూట్, యప్ టీవీ, లయన్స్ గేట్, షెమారో, హంగామా ఓటీటీల సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం