తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Diwali Offer 2022: బీఎస్ఎన్ఎల్ దీపావళి బంపర్ ఆఫర్లు

BSNL Diwali Offer 2022: బీఎస్ఎన్ఎల్ దీపావళి బంపర్ ఆఫర్లు

HT Telugu Desk HT Telugu

29 October 2022, 20:04 IST

  • BSNL Diwali Offer 2022: ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ BSNL దీపావళి సందర్భంగా తమ ప్రి పెయిడ్ యూజర్ల కోసం రెండు కొత్త వోచర్లను తీసుకువచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BSNL Diwali Offer 2022: దేశవ్యాప్తంగా ఉన్న అందరు BSNL ప్రి పెయిడ్ వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు టెలీకం సంస్థలైన ఎయిర్ టెల్, జియో, వీ లతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్న బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ల ద్వారా యూజర్ బేస్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

BSNL Diwali Offer 2022: రూ. 1198 ప్లాన్..

దీపావళి ఆఫర్ లో భాగంగా రెండు కొత్త ప్లాన్లను BSNL తీసుకువచ్చింది. అందులో ఒకటి సంవత్సరం వాలిడిటీ ఉన్న రూ. 1198 ప్లాన్. ఈ ప్లాన్ లో సంవత్సరం పాటు, అంటే 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్న వారు 12 నెలల పాటు ప్రతీ నెల 300 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ పొందుతారు. ఈ 300 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ సౌకర్యాలు.. వాడినా, వాడకపోయినా, ఆ నెలతో ముగుస్తాయి. మరుసటి నెలకు అవి క్యారీ ఫార్వర్డ్ కావు. మరుసటి నెల మళ్లీ కొత్తగా 300 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ లను పొందుతారు.

BSNL Diwali Offer 2022: రూ. 439 ప్లాన్

మరో ప్లాన్ రూ. 439. ఈ ప్లాన్ తో రీ చార్జ్ చేసుకుంటే మూడు నెలలు లేదా 90 రోజుల వాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ సదుపాయం లభిస్తుంది. ఈ ప్లాన్ తో ఎలాంటి డేటా లభించదు. బేసిక్ ఫోన్ వాడే వారికి ఈ ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుంది.

BSNL Diwali Offer 2022: మరో రెండు ప్లాన్లు

ఇవి కాకుండా, ఒక ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ ను, మరో గేమింగ్ ప్లాన్ ను కూడా BSNL ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మొదటిది రూ. 269లతో 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కాగా, మరొకటి రూ. 769తో 90 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్. రూ. 269 ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీతో పాటు, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లభిస్తాయి. రూ. 769 ప్లాన్ తో కూడా ఇవే బెనిఫిట్స్ లభిస్తాయి. కానీ వ్యాలిడిటీ మాత్రం 90 రోజులు ఉంటుంది.

తదుపరి వ్యాసం