తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl: బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఆఫర్ మరో 5 రోజులే!

BSNL: బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఆఫర్ మరో 5 రోజులే!

26 March 2023, 17:54 IST

  • BSNL Bharat Fibre Broadband: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ప్రస్తుతం ఓ ఆఫర్ అందుబాటులో ఉంది. మార్చి 31వ తేదీ వరకు ఇది ఉంటుంది.

BSNL: బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఆఫర్ మరో 5 రోజులే!
BSNL: బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఆఫర్ మరో 5 రోజులే! (HT_Photo)

BSNL: బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ఆఫర్ మరో 5 రోజులే!

BSNL Bharat Fibre Broadband: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్.. ప్రస్తుతం ఓ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కొత్తగా వచ్చే కస్టమర్ల కోసం దీన్ని అమలు చేస్తోంది. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి ఇది బెనిఫిట్‍గా ఉంటుంది. మార్చి 31న ఈ ఆఫర్ ముగుస్తుంది. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఆఫర్ ఇదే

BSNL Bharat Fibre Offer: భారత్ ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు ఇన్‍స్టాలేషన్ చార్జీలపై రూ.500 తగ్గింపును బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం అందిస్తోంది. ఇప్పటికే ఉన్న ల్యాండ్‍లైన్ యూజర్లు.. భారత్ ఫైబర్ కు మారాలంటే చెల్లించాల్సిన చార్జీలపై రూ.1,200 డిస్కౌంట్ ఇస్తోంది. మార్చి 31వ తేదీ.. అంటే మరో 5 రోజుల పాటు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ కనెక్షన్ల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ కనెక్షన్ కోసం దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‍ను ప్రజలు సంప్రదించవచ్చు. లేకపోతే బీఎస్ఎన్ఎల్ వెబ్‍సైట్ ద్వారా కూడా కనెక్షన్‍ను బుక్ చేసుకోవచ్చు.

BSNL Bharat Fibre Broadband Plans: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్‍లో ప్రస్తుతం రూ.329.. ఎంట్రీ లెవెల్ ప్లాన్‍గా ఉంది. ఈ ప్లాన్‍ను తీసుకుంటే 20 Mbps స్పీడ్‍తో నెలకు 1000జీబీ డేటా లభిస్తుంది. నెలలో 1000జీబీ అయిపోతే ఆ తర్వాత 4ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రూ.4,799 వరకు విభిన్న బెనిఫిట్లతో బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్లు ఉన్నాయి. మొత్తంగా 15కు పైగా ప్లాన్స్ ఉన్నాయి. ఓటీటీ బెనిఫిట్స్ ఉండే బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్లు రూ.666 నుంచి ప్రారంభం అవుతున్నాయి.

బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.399 ప్లాన్‍ను తీసుకుంటే 30 Mbps వేగంతో నెలకు 1000 జీబీ డేటా లభిస్తుంది. రూ.449 ప్లాన్‍తో 30 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 3,300 జీబీ డేటా దక్కుతుంది. ఇక రూ.666 ప్లాన్‍ను తీసుకుంటే 60 Mbps వేగంతో 3,300జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+హాట్‍స్టార్ సూపర్ ప్లాన్ ఉచితంగా ఈ ప్లాన్‍తో వస్తుంది. ఇలా మరిన్ని భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది.

టాపిక్

తదుపరి వ్యాసం