తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diabetic Term Plan : డయాబెటిక్​ రోగుల కోసం తొలిసారిగా ప్రత్యేక ‘టర్మ్​ ప్లాన్​’..

Diabetic term plan : డయాబెటిక్​ రోగుల కోసం తొలిసారిగా ప్రత్యేక ‘టర్మ్​ ప్లాన్​’..

Sharath Chitturi HT Telugu

09 June 2023, 11:07 IST

    • Diabetic term plan : మధుమేహంతో బాధపడుతున్న వారికోసం ప్రత్యేకంగా ఒక టర్మ్​ ప్లాన్​ను తీసుకొచ్చింది బజాజ్​ అలయన్స్​ లైఫ్​. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
డయాబెటిక్​ రోగుల కోసం తొలిసారిగా ప్రత్యేక టర్మ్​ ప్లాన్​..
డయాబెటిక్​ రోగుల కోసం తొలిసారిగా ప్రత్యేక టర్మ్​ ప్లాన్​.. (HT_PRINT)

డయాబెటిక్​ రోగుల కోసం తొలిసారిగా ప్రత్యేక టర్మ్​ ప్లాన్​..

Diabetic term plan : 'టర్మ్​ ఇన్ష్యూరెన్స్​' అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మనకి ఏమైనా జరిగితే.. ఈ టర్మ్​ ప్లాన్​తో మన కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇవ్వొచ్చు. ఇందులో అనేక ప్లాన్స్​ ఉంటాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే.. తొలిసారిగా డయాబెటిక్​ రోగుల కోసం ప్రత్యేకంగా ఓ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ పాలసీని తీసుకొచ్చింది బజాజ్​ అలయన్స్ లైఫ్​​. ఈ పాలసీతో వచ్చే ప్రయోజనాలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

ఈ పాలసీతో కలిగే ప్రయోజనాలు..

హెచ్​బీఏ1సీ లెవల్​ 8శాతం లేదా అంతకన్నా తక్కువ ఉన్న టైప్​ 2 డయాబెటిక్స్​ రోగులతో పాటు ప్రీ-డయాబెటిక్స్​ వారి కోసం ఈ పాలసీ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఫలితంగా డయాబెటిక్​ రోగులు తమ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించవచ్చు. 'కీప్​ ఫిట్​' బెనిఫిట్​ సైతం లభిస్తుండటంతో, పాలసీ ప్రీమియం తగ్గే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. ఫలితంగా అటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఇటు ప్రిమియంను కూడా తగ్గించుకోవచ్చు. నెలవారీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ వంటి ప్రీమియం పేమెంట్​ ఆప్షన్స్​ ఈ టర్మ్​ ప్లాన్​తో లభిస్తోంది. ట్యాక్స్​ బెనిఫిట్స్​ సైతం ఉన్నాయి.

ఇదీ చూడండి:- Term insurance : ఈ తప్పులు చేస్తే మీ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ క్లెయిమ్​ రిజెక్ట్​ అవుతుంది.. జాగ్రత్త!

పాలసీదారు మరణంతో, నామినీకి లమ్​సమ్​ అమౌంట్​ లభిస్తుంది. ఈ లమ్​సమ్​ అమౌంట్​ అన్నది మనం ఎంచుకునే ఆప్షన్స్​పై ఆధారపడి ఉంటుంది. 10శాతం యాన్యువల్​ ప్రీమియం, మరణం వరకు 105శాతం కట్టిన పూర్తి ప్రీమియం వస్తుంది. టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ కావడంతో.. మెచ్యూరిటీ బెనిఫిట్​లు ఏమీ ఉండవు.

ఎలిజబులిటీ వివరాలు..

ఎంట్రీ వయస్సు:- కనిష్ఠం- 30ఏళ్లు, గరిష్ఠం- 60ఏళ్లు.

Bajaj Allianz life Diabetic term plan Sub 8 HbA1c : మెచ్యూరిటీ ఏజ్​:- కనిష్ఠం- 35ఏళ్లు, గరిష్ఠం- 75ఏళ్లు.

పాలసీ టర్మ్​:- కనిష్ఠం- ఐదేళ్లు, గరిష్ఠం- 25ఏళ్లు.

సమ్​ అష్యూర్డ్​:- కనిష్ఠం- రూ. 25లక్షలు, గరిష్ఠం- పాలసీ ప్రీమియం బట్టి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం బజాజ్​ అలయన్స్​ కస్టమర్​ కేర్​ను లేదా వెబ్​సైట్​ను సంప్రదించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం