తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Alexa Stops Working: ‘‘ఈ డివైజెస్ లో ఇక ఆమెజాన్ అలెక్సా పని చేయదు..’’

Alexa stops working: ‘‘ఈ డివైజెస్ లో ఇక ఆమెజాన్ అలెక్సా పని చేయదు..’’

HT Telugu Desk HT Telugu

26 September 2023, 21:30 IST

  • Alexa stops working: ఆమెజాన్ అలెక్సా సర్వీసెస్ కు సంబంధించి ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆమెజాన్ అలెక్సా గూగుల్ నెస్ట్ కిట్ పై పనిచేయదని, ఆ మేరకు లెగసీ నెస్ట్ స్కిల్స్ కు గూగుల్ సర్వీసెస్ సపోర్ట్ ను నిలిపివేస్తున్నామని ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Alexa stops working: ఆమెజాన్ సర్వీసెస్ వాడుతున్న వారికి అలెక్సా చిర పరిచితం. సెర్చింగ్ అవసరాలకు, స్మార్ట్ హోం సర్వీసెస్ కు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సేవలను చాలా మంది ఉపయోగిస్తుంటారు. అయితే, త్వరలో గూగుల్ నెస్ట్ కిట్ పై అలెక్సా సేవలు నిలిచిపోనున్నాయి. ఆ మేరకు లెగసీ నెస్ట్ స్కిల్స్ కు గూగుల్ సర్వీసెస్ సపోర్ట్ ను నిలిపివేస్తున్నామని గూగుల్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

సెప్టెంబర్ 29 నుంచి..

గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు సెప్టెంబర్ 29 నుంచి నిలిచిపోనున్నాయి. అయితే, నిరంతరాయంగా ఆ సేవలను పొందాలనుకునేవారికి ఈ క్రింది ప్రొసీజర్ ను ఫాలో కావడం ద్వారా అలెక్సా సేవల్లో ఎలాంటి అంతరాయం కలగదు. అలెక్సా సేవలు నిరంతరాయంగా పొందాలనుకునే వారు వెంటనే గూగుల్ నెస్ట్ కిట్ నుంచి గూగుల్ నెస్ట్ స్కిల్ ఫర్ అలెక్సాకు మారాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గూగుల్ వెల్లడించింది. ‘‘అలెక్సా ద్వార నెస్ట్ డివైజెస్ సేవలు పొందాలనుకుంటే తమ నెస్ట్ అకౌంట్ ను వినియోగదారులు గూగుల్ నెస్ట్ స్కిల్ ఫర్ అలెక్సాకు మారాల్సి ఉంటుంది’’ అని గూగుల్ ప్రకటించింది.

ఇలా చేయండి..

  • ముందుగా మీ ఫోన్ లోని అలెక్సా యాప్ ను ఓపెన్ చేయండి.
  • Tap more పై క్లిక్ చేయండి.
  • skills and Games ను సెలక్ట్ చేయండి.
  • Find your Skills ను సెలెక్ట్ చేయండి.
  • Find Nest Alexa Skill ను సెలెక్ట్ చేసి డిసేబుల్ చేయండి.
  • అలెక్సా యాప్ లోని అన్ని నెస్ట్ డివైజెస్ ను రిమూవ్ చేయండి.
  • గూగుల్ హోం యాప్ లో new Google Nest Alexa skill ను ఇనేబుల్ చేయండి. అందుకు గానూ ముందుగా గూగుల్ హోం యాప్ లో కింద భాగంలో ఉన్న సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. + icon పై ట్యాప్ చేయాలి. సర్వీసెస్ ను ఎంపిక చేసుకుని, అందులో ఆమెజాన్ అలెక్సా స్కిల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అలెక్సా యాప్ ను ఓపెన్ చేసి, యాక్టివేట్ చేసుకోవాలి.

తదుపరి వ్యాసం