తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hilux | టయోట నుంచి సరికొత్త పికప్ ట్రక్ వాహనం 'హిలక్స్'.. బుకింగ్‌లు ప్రారంభం!

Hilux | టయోట నుంచి సరికొత్త పికప్ ట్రక్ వాహనం 'హిలక్స్'.. బుకింగ్‌లు ప్రారంభం!

30 January 2022, 6:19 IST

2022, మార్చిలో ‘టయోటా హిలక్స్’ పికప్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు టయోట ఇండియా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వాహనం భారతీయ వినియోగదారుల అభిరుచిని మారుస్తుందని, పికప్ వాహనాలపై ఆసక్తిని పెంచుతుందని కంపెనీ ఆశలు పెట్టుకుంది.

  • 2022, మార్చిలో ‘టయోటా హిలక్స్’ పికప్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు టయోట ఇండియా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వాహనం భారతీయ వినియోగదారుల అభిరుచిని మారుస్తుందని, పికప్ వాహనాలపై ఆసక్తిని పెంచుతుందని కంపెనీ ఆశలు పెట్టుకుంది.
విదేశాల్లో పికప్ ట్రక్కుల వినియోగం అతి సాధారణం, అయితే భారత రోడ్లపై మాత్రం ఇలాంటి పికప్ వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చే ఈ సరికొత్త 'టయోటా హిలక్స్' పికప్ ట్రక్కులపై వాహనదారుల ఆసక్తి ఏమేరకు ఉంటుందో చూడాలి.
(1 / 11)

ఇదివరకే ఇండియాలో ఈ తరహా వాహణశ్రేణిలో ఇసుజు కంపెనీ V-క్రాస్ పేరుతో పికప్ ట్రక్కును ప్రవేశపెట్టింది. ఇప్పుడు 'టయోటా హిలక్స్' దానికి పోటీగా నిలవనుంది.
(2 / 11)

ఈ టయోటా హిలక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పికప్ ట్రక్కులలో ఒకటి. దీనిని కంపెనీ లాంచ్ చేసిన దగ్గర్నించీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 దేశాలలో 20 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయి.
(3 / 11)

ఈ సరికొత్త టయోటా హిలక్స్ పికప్ ట్రక్ డిజైన్‌ పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, చూడటానికి చాలా దృఢంగా, ఒక శక్తివంతమైన వాహనంగా కనిపిస్తుంది.
(4 / 11)

భారత మార్కెట్లోకి 2022 మార్చిలో విడుదల కాబోతున్న ఈ పికప్ ట్రక్ కోసం, కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించింది.
(5 / 11)

ఇక టయోటా హిలక్స్ పికప్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో ఐదుగురు వ్యక్తులు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీతో పాటు, డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.
(6 / 11)

ఈ వాహనం ముందు భాగం క్రోమ్ లైనింగ్‌తో ఒక ధృడమైన గ్రిల్‌ కలిగిన కవచాన్ని కలిగి ఉంది. LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్కిడ్ ప్లేట్ ఈ వాహనానికి మంచి లుక్‌ను అందించాయి.
(7 / 11)

వెనుకవైపు, టెయిల్‌లైట్‌లు నిలువుగా పేర్చనట్లు ఉన్నాయి. స్టీల్ కవచంతో నల్లటి బంపర్, పెద్ద లోడ్ మోసుకెళ్లేలా మంచి సామర్థ్యం కలిగిన డెక్‌ని ఇచ్చారు.
(8 / 11)

ఇక ప్రీమియం కారులో ఉన్నట్లుగానే టయోటా హిలక్స్ క్యాబిన్ లోపల అవసరమయ్యే అన్ని ఫీచర్లను అందించారు.
(9 / 11)

ఇందులో Apple CarPlay, Android Auto సపోర్ట్ కలిగిన ట్యాబ్ లాంటి ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.
(10 / 11)

క్యాబిన్‌లో ప్రయాణించే వారికి వీలుగా డ్యూయల్-జోన్ ఆటో AC, సాఫ్ట్-టచ్ లెదర్ సీట్లు, కప్ హోల్డర్‌లు, ఆర్మ్‌రెస్ట్ మొదలగు సౌకర్యాలు ఉన్నాయి.
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి