తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  November 09 Telugu News Updates : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు

November 09 Telugu News Updates : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

09 November 2022, 23:07 IST

  • తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

09 November 2022, 22:39 IST

అనిశా కస్టడీకి ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసిన విషయం తెలిసిందే. నిందితులను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ చేసిన అనిశా కోర్టు నిందితుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

09 November 2022, 22:36 IST

అందుకే దుబాయ్ నుంచి వచ్చా

ఈడీ, ఐటీ దాడులపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈడీకి సహకరించేందుకే దుబాయ్ నుంచి వచ్చానని తెలిపారు. సోదాల కోసం ఇంటి తాళాలు పగలగొట్టమని చెప్పింది తానేనన్నారు. సోదాల్లో ఎంత నగదు చేశారో వాళ్లకే తెలియాలన్నారు. మైనింగ్ రాయల్టీ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని చెప్పారు. ఈ విషయంలో ఈడీకి ఏం సంబంధమో అర్థంకావడం లేదని పేర్కొన్నారు.

09 November 2022, 22:34 IST

సివిల్ సప్లయ్స్ కుంభకోణంపై ఏసీబీ సోదాలు

నెల్లూరు సివిల్ సప్లయ్స్ కుంభకోణంపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జిల్లాలోనే 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

09 November 2022, 18:40 IST

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ మేరకుఆదేశాలు జారీచేసింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది.

09 November 2022, 15:10 IST

మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బండి

రామగుండంలోని ఎన్టీపీసీ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా పరిశీలించారు.

09 November 2022, 13:36 IST

సాయం చేసిన ఎమ్మెల్సీ కవిత 

యూట్యూబ్ లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ నాందేవ్ గూడ‌కు చెందిన హారికకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత స్పందించారు. ఈ మేరకు హారికను భరోసానిచ్చారు. కోర్సు పూర్తి చేయడానిక అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు.

09 November 2022, 11:33 IST

ఈడీ సోదాలు…

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది.  హైదరాబాద్ లోని దినేష్ ఆరోరా అప్రూవర్ గా మారడం తో మరోసారి మొదలైన ఈడీ సోదాలు చేపట్టింది. ఐటీ శాఖ, ఈడీ సంయుక్తంగా సోదాలు జరుపుతున్నాయి. కరీంనగర్, హైదరాబాద్ లో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. 

09 November 2022, 11:03 IST

సూసైడ్….. 

యాదగిరిగుట్ట మండలం బాహుపేట రైల్వే గేట్ సమీపంలో ట్రైన్ కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్ కు చెందినవారిగా గుర్తించారు. 

09 November 2022, 10:29 IST

సీఎం జగన్ టూర్… 

సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా ఖరారైంది.  భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంత్యుత్సవం సందర్భంగా ఈ నెల 11న గుంటూరులో జరగనున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

09 November 2022, 10:25 IST

వచ్చే నెలలో రైతు బంధు… 

యాసంగి సీజన్ వచ్చేసింది. దీంతో రైతుబంధు నిధుల జమపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో జమ చేసేలా రాష్ట్ర వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది. అయినే నిధుల విడుదలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

09 November 2022, 9:37 IST

స్మితా సబర్వాల్ ట్వీట్…. 

ఓ గ్యాంగ్‌ రేప్ కేసులో నిందితుడి శిక్షను రద్దు చేస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. దీనిపై ఐఏఎస్ అధికారి, తెలంగాణ సీఎంవో సెక్రటరీ స్మితాసబర్వాల్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. న్యాయపరంగా ఇలా నిరాశాజనక ధోరణి కొనసాగితే.. మహిళలు ఆయుధాలు ధరించేందుకు అనుమతి ఇవ్వాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. చట్టం, న్యాయం రెండు వేర్వేరు వ్యవస్థలు కావొద్దని ట్వీట్ లో రాసుకొచ్చారు.

09 November 2022, 7:59 IST

నేపాల్ లో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

నేపాల్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూప్రకంపనల దాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈ ప్రకంపనాలు ఢిల్లీ పరిసర ప్రాంతాలను కూడా తాకాయి.

09 November 2022, 7:15 IST

వర్ష సూచన… 

నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో నవంబర్ 10న అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఫలితంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

09 November 2022, 6:50 IST

నేటి బంగారం ధరలు..

Today Gold and Silver Price: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధరలు తగ్గగా.. ఇవాళ కూడా దిగివచ్చాయి. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,050గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు స్వల్పంగా పెరిగింది.

09 November 2022, 6:50 IST

మరో కేసు 

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    ఆర్టికల్ షేర్ చేయండి