తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  January 23 Telugu News Updates : టీచర్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు

January 23 Telugu News Updates : టీచర్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

23 January 2023, 19:49 IST

  • రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 27 నుంచి ప్రక్రియ చేపడుతూ.. ప్రభుత్వం షెడ్యూల్ వెలువరించింది. జనవరి 28న మొదలై... మార్చి 4 నాటికి ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. వీటిపై అప్పీళ్ల కోసం మరో రెండు వారాల గడువు ఇచ్చారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టీచర్ల దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. ఈ మేరకు సమగ్ర షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేసింది.

23 January 2023, 19:49 IST

భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్ లో పోలీసులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో.. రెండు కార్లలో చెక్ చేయగా.. భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదు సుమారు రూ. 4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అదంతా హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

23 January 2023, 19:26 IST

షెడ్యూల్ విడుదల.. డీఏ పెంపు

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 27 నుంచి ప్రక్రియ చేపడుతూ.. ప్రభుత్వం షెడ్యూల్ వెలువరించింది. జనవరి 28న మొదలై... మార్చి 4 నాటికి ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. వీటిపై అప్పీళ్ల కోసం మరో రెండు వారాల గడువు ఇచ్చారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టీచర్ల దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. ఈ మేరకు సమగ్ర షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

23 January 2023, 17:17 IST

సీఐడీ చీఫ్ బదిలీ

ఏపీ సీఐడీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... సీఐడీ అదనపు డీజీగా ఎన్. సంజయ్ ను నియమించింది. ఆయన ప్రస్తుతం విపత్తు నిర్వహణ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

23 January 2023, 17:00 IST

విచారణ వాయిదా

ఏపీలో రోడ్లపై సభలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ వన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో ఇవాళ విచారణ జరగగా... చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట... పిటిషనర్ సీపీఐ రామకృష్ణ తరపున న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ జీవో రాజ్యాంగ విరుద్దమని అన్నారు. సెక్షన్ 30 ప్రకారం కొన్ని ఆమోదయోగ్యమైన ఆంక్షలు విధించొచ్చన్న ఆయన... అసలు సభలు, ర్యాలీలు పూర్తిగా నిషేధించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని వాదించారు. ప్రభుత్వం తరపున ఏజీ, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటకి వాయిదా వేసింది.

23 January 2023, 16:51 IST

వివేకా హత్య కేసు విచారణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా.. సీబీఐ అధికారులు సోమవారం పులివెందుల వైకాపా కార్యాలయానికి వెళ్లారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. ఆయన ఆఫీసుకి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో వెనుదిరిగిన సీబీఐ అధికారులు... పట్టణంలో ఉన్న భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు.

23 January 2023, 16:19 IST

తిరుమల

తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు... టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డు నుంచి అన్నదానం కాంప్లెక్స్ వరకు సర్వే చేయడానికి ఐవోసీకి అనుమతి ఇచ్చామని... వారు అత్యుత్సాహంతో ఆలయ పరిసరాల్లో డ్రోన్ తో చిత్రీకరించారని తెలితే చర్యలు తప్పవని చెప్పారు. డ్రోన్ వీడియోపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. యూట్యూబ్ నుంచి తిరుమల డ్రోన్ దృశ్యాలు తొలగించామని తెలిపారు. తిరుమలలో భద్రతా చర్యల అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు.

23 January 2023, 16:11 IST

బాసరలో విషాదం

నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి మానస (27), పిల్లలు బాలాదిత్య (8), నవ్యశ్రీ (7) గా గుర్తించారు. మృతులు నిజామాబాద్ లోని గోల్ హనుమాన్ నగర్ వాసులుగా గుర్తించారు.

23 January 2023, 13:41 IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలియచేయాలని నోటీసు లో  సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది.  వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కోన్నారు. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.  వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ఇతర మార్గాలున్నా గవర్నర్ ను ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ కోరింది.  రోసా రూల్స్ ఉల్లంఘించినందున గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలియచేయాలని ఏపీ జీఈఏ కి నోటీసు జారీ చేసింది.

23 January 2023, 12:47 IST

కడపలో లోకేష్ పర్యటన….

ఈనెల 25న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప వెళుతున్నారు.  కడపలో పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను  సందర్శించనున్నారు.  పెద్ద దర్గా, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.  ఈనెల 26న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.  ఈనెల 27న కుప్పం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. 

23 January 2023, 12:26 IST

తోటి ఉద్యోగుల మీద  పోలీసులు ప్రతాపం చూపొద్దు…..

ఉపాధ్యాయులపై పోలీసుల ప్రవర్తన దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ ఆరోపించారు.  పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని గుర్తుంచుకోవాలన్నారు. డబ్బులిచ్చిన వారికి మాత్రమే  పోస్టింగులు వచ్చాయని, డబ్బులివ్వని వారికి  స్పౌజ్‌ కేసుల్లో సైతం పోస్టింగులు ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని పోలీసులు బూతులు తిట్టడం సరికాదన్నారు. 

23 January 2023, 12:14 IST

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మహబూబ్ భాషా అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం  రేపింది. ప్రభుత్వం కేటాయించిన భూమిని వైసీపీ నాయకులు  కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ  భాషా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

23 January 2023, 12:13 IST

కామారెడ్డిలో విద్యుత్ ఉద్యోగుల నిర్బంధం

కామారెడ్డి జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగలును కనగల్ గ్రామస్తులు నిర్బంధించారు. ఏసీడీ ఛార్జీల పేరుతో వినియోగదారులపై ప్రభుత్వం భారాన్ని మోపుతోందని ఆరోపిస్తూ  గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మీటర్ రీడింగ్‌కు వచ్చిన ఉద్యోగులను నిర్బంధించి, విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

23 January 2023, 12:11 IST

బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో చలో ప్రగతి భవన్‌కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడించేందుకు సిద్ధమవ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు.  

23 January 2023, 9:54 IST

వసతి గృహంలో లైంగిక వేధింపులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల బాలికల వసతి గృహంలో లైంగిక వేధింపులు వెలుగు చూశాయి. బాలికలపై వేధింపులకు పాల్పడినట్లు వార్డెన్ భర్త పవన్‍పై ఆరోపణలు వచ్చాయి. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్ భర్త పవన్ కుమార్‍పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

23 January 2023, 9:53 IST

చేగొండి బహిరంగ లేఖ

ఏపీ సిఎం  చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు.  వైసీపీ పాలన అంతమొందించేందుకు టీడీపీ-జనసేన పొత్తు అవసరమన్నారు.  సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్‍ను ప్రకటించాలని,  కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే రాజ్యాధికారం అవసరమన్నారు. - బడుగు, బలహీనవర్గాల రాజ్యమే కాపు సంక్షేమ సేన లక్ష్యమని   చేగొండి హరిరామజోగయ్య చెప్పారు. 

23 January 2023, 9:52 IST

యూపీలో ఘోర ప్రమాదం

యూపీలోని  ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారులపైకి  ట్రక్కు దూసుకెళ్లడంతో  ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను  ఆస్పత్రికి తరలించారు.  కాన్పూర్-లక్నో హైవేపై ఘటన చోటు చేసుకుంది. 

23 January 2023, 9:50 IST

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. ఆదివారం  శ్రీవారిని  73 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.  తిరుమలలో 24,852 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించారు.  తిరుమలలో ఆదివారం  శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు లభించింది. 

23 January 2023, 9:49 IST

జీవో నంబర్ 1పై విచారణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన  జీవో నెంబర్ 1పై నేడు  ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.  సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించకపోవడంతో హైకోర్టు చీఫ్‌ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపనుంది.  ఏపీ ప్రభుత్వం జారీ చేసి  జీవో నెం.1 పైనేటి వరకు తాత్కలిక సస్పెన్షన్ విధిస్తూ ఏపీ హైర్టు తీర్పు వెలువరించింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి