బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు రిషి సునాక్ వచ్చారు. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే రిషి సునాక్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సదస్సుకు వచ్చే ముందు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాట్లాడారు. సరైన సమయంలో సరైన భారత్ కు జీ20 సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. శని, ఆదివారాల్లో జరగనున్న సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.