Udaipur Accused Attacked | `ఉద‌య్‌పూర్` నిందితుల‌పై దాడి-udaipur accused attacked outside court ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Udaipur Accused Attacked | `ఉద‌య్‌పూర్` నిందితుల‌పై దాడి

Udaipur Accused Attacked | `ఉద‌య్‌పూర్` నిందితుల‌పై దాడి

Jul 02, 2022 07:04 PM IST HT Telugu Desk
Jul 02, 2022 07:04 PM IST

రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో టైల‌ర్ క‌న్హ‌య్య‌లాల్‌ను త‌ల న‌రికి దారుణంగా చంపిన హంత‌కుల‌పై జైపూర్ కోర్టులో ప్ర‌జ‌లు దాడికి ప్ర‌య‌త్నించారు. జైపూర్‌లోని ఎన్ఐఏ కోర్టులో నిందితులు న‌లుగురిని పోలీసులు హాజ‌రుప‌ర్చారు. అప్ప‌టికే అక్క‌డ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమికూడారు. నిందితుల‌కు 10 రోజుల ఎన్ఐఏ క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తించింది. అనంత‌రం, వారిని తిరిగి పోలీస్ వ్యాన్ వ‌ద్ద‌కు తీసుకువ‌స్తుండ‌గా, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున చేరి, ఆ నిందితుల‌పై దాడికి దిగారు. అయితే, పోలీసులు అతి క‌ష్టం మీద వారిని అడ్డుకుని, నిందితుల‌ను వ్యాన్ లోకి ఎక్కించారు. కోర్టుహాళ్లో కూడా లాయ‌ర్లు నిందితుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వారికి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఉరిశిక్ష విధించాల‌ని డిమాండ్ చేశారు. మొహ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను కించ‌ప‌రుస్తూ వ్యాఖ్య‌లు చేసిన నుపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన టైల‌ర్‌ క‌న్హ‌య్య‌లాల్‌ను దుండగులు గ‌త‌వారం ఆయ‌న షాపులోనే దారుణంగా చంపేశారు. ఆ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

More