Crop Loan Waiver Scheme in Telangana: తెలంగాణ రైతులకు రుణమాఫీపై సర్కార్ శుభవార్త చెప్పింది. ఆగస్టు 14వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు. తెలంగాణలోని రూ.99 వేల లోపు పంట రుణాలు మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం నుంచి విడుదల చేయనుందని వివరించారు. మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు. మొత్తంగా నెలలోపు తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.