BMW i7 electric Sedan | కార్‌లోనే మూవీ థియేటర్ వినోదం, ప్రయాణం ఎంతో విలాసం!-bmw i7 electric sedan luxury on wheels ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bmw I7 Electric Sedan | కార్‌లోనే మూవీ థియేటర్ వినోదం, ప్రయాణం ఎంతో విలాసం!

BMW i7 electric Sedan | కార్‌లోనే మూవీ థియేటర్ వినోదం, ప్రయాణం ఎంతో విలాసం!

Apr 20, 2022 08:32 PM IST HT Telugu Desk
Apr 20, 2022 08:32 PM IST

BMW 7 సిరీస్ లో కొత్త కార్స్ వచ్చేస్తున్నాయి. ఇందులో i7 ఎలక్ట్రిక్ సెడాన్ కూడా ఉంది. ఈ సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్.. సెడాన్ కేటగిరీలో మెర్సిడెస్ ఈక్యూఎస్‌తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారులో ప్రయాణం ఎంతో విలాసవంతంగా ఉంటుంది. i7 లోపల భారీ 31-అంగుళాల 8K OLED థియేటర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ను అమర్చారు. ఇది వెనకాల కూర్చునేవారికి వినోదాన్ని పంచడంతో పాటు ప్రైవసీని కల్పిస్తుంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే ఇప్పట్నించే ప్రీ-ఆర్డర్ చేయవచ్చు, డెలివరీలు ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభమవుతాయి. మరి ఈ కారులో ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి, ఇంటీరియర్ ఎలా ఉంది మొదలగు విశేషాలను ఈ కింది వీడియోలో చూడండి. 

More