Mla Kodali Nani | ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదు...కామెడీ పోస్ట్ అవుతుంది
- పవన్ యుద్ధం కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యుద్ధం ఎక్కడ చేస్తున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి యుద్ధం ఎక్కడ చేస్తారో ఇకనైనా చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీయో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారని, మీరేమో యుద్ధం పేరుతో మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదని కామెడీ పోస్ట్ అవుతుందని కొడాలి నాని అన్నారు.