Janasena MLA Pantham Nanaji|కొ*డకా అంటూ రెచ్చిపోయిన పంతం నానాజీ..పవన్ తీవ్ర ఆగ్రహం!-kkakinada rural mla pantam nanaji scolded the doctor ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janasena Mla Pantham Nanaji|కొ*డకా అంటూ రెచ్చిపోయిన పంతం నానాజీ..పవన్ తీవ్ర ఆగ్రహం!

Janasena MLA Pantham Nanaji|కొ*డకా అంటూ రెచ్చిపోయిన పంతం నానాజీ..పవన్ తీవ్ర ఆగ్రహం!

Published Sep 23, 2024 12:01 PM IST Muvva Krishnama Naidu
Published Sep 23, 2024 12:01 PM IST

  • అధికారులపై నోరు పారేసుకోవటం ప్రజా ప్రతినిధిలకు పరిపాటిగా మారింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. చివరికి నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో నాలుక కరచుకొని క్షమాపణలు చెబుతున్నారు. తాజాగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విషయంలోనూ ఇదే జరిగింది. రంగరాయ మెడికల్ కాలేజ్ మైదానంలో ఎమ్మెల్యే అనుచరులు అనుమతి లేకుండా వాలీబాల్ ఆడేందుకు నెట్ కట్టారు. అయితే స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు వ్యతిరేకించి, ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆడుకోవాలని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి బూతులతో విరుచుకుపడ్డారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వరని తిట్ల పురాణం అందుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఇవాళ ఎమ్మెల్యే తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.

More