latest-telugu-news News, latest-telugu-news News in telugu, latest-telugu-news న్యూస్ ఇన్ తెలుగు, latest-telugu-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest latest telugu news Photos

ఉసిరికాయ నిజానికి అద్భుతమైన ఫలంగానే భావించాలి. సూపర్‌ఫుడ్‌‌గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ రెంటు రెట్లు అధికంగా ఉంటాయి.

Anti Oxidant Amla: ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉసిరితో ప్రయోజనాలు ఎన్నో…

Thursday, November 7, 2024

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి ఉషా తల్లిదండ్రులు  చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా అమెరికాకు చెందిన జేడీ వాన్స్‌ను వివాహం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష బరిలో ఉన్నారు.

US President Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ గ్రామంలో ఉత్కంఠ, ఉపాధ్యక్ష రేసులో వడ్లూరు అల్లుడు..

Wednesday, November 6, 2024

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు  ఫ్లైట్ కనెక్టివిటీ పెంపొందించేందుకు  సీ ప్లేన్‌లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్‌ 9వ తేదీన విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో ప్రయాణిస్తారు. దేశంలోని పలు నగరాల్లో సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sea Plane Services: రేపు విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్‌…దేశంలో నాలుగు నగరాల్లో సర్వీసులు

Wednesday, November 6, 2024

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే  అభ్యర్థుల వినతి మేరకు  కనీసం 90 రోజులు వ్యవధి ఇవ్వడం,   గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హులు జాబితాని 1:100 నిష్పత్తికి పెంచాలనిఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవి రావు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

APPSC Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు

Tuesday, November 5, 2024

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

TG Weather updates: తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, హైదరాబాాద్‌లో వాన

Friday, November 1, 2024

దీపావళి పండుగ నేపథ్యంలో పండుగ ప్రయాణాల రద్దీ నియంత్రణ కోసం విజయవాడలో రైలు ప్రయాణాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు.  పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా   సన్నద్ధమయ్యారు. పండుగ మరియు సెలవుల సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను పలు మార్గాల్లో నడుపుతున్నారు. ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా క్యూ పద్ధతి ప్రవేశపెట్టారు.

Passenger Crowd Control: అటెన్షన్ ప్లీజ్, క్యూ పద్ధతి పాటించండి.. విజయవాడ రైల్వే స్టేషన్లో క్యూలో వెళ్లాల్సిందే…

Thursday, October 31, 2024

తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతం చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు  వీస్తాయని ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Cyclone Dana AP Updates: అర్థరాత్రికి తీరం దాటనున్న దానా తుఫాన్, ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్

Thursday, October 24, 2024

అనంతపురం జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పట్టణాన్ని అనుకుని ప్రవహించే పండమేరు పొంగడంతో వందలాది నివాసాలు నీట మునిగాయి.  కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోట్‌ బంక్‌లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పండమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Anantapuram Rains: ఏపీలో ఈసారి అనంతపురం వంతు.. పట్టణాన్ని ముంచెత్తిన పండమేరు వరద.. నీట మునిగిన ఇళ్లు

Tuesday, October 22, 2024

దక్షిణ కోస్తాజిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

AP TG Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్‌, రాయలసీమలో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వానలు

Tuesday, October 15, 2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో సారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరి తల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.

AP Cyclone Alert: ఏపీ మళ్లీ తుఫాను ముప్పు, ఈసారి రాయలసీమ వంతు, ఐఎండి అంచనాలు…

Friday, October 11, 2024

స్థిరాస్తులు చాలా రకాలు ఉంటాయి. అందులో అమ్మవారికి ఉన్న హక్కుల విషయంలో మొదట స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది.  సంపూర్ణ హక్కులు ఉన్న స్థిరాస్తులు,  పరిమిత హక్కులున్న స్థిరాస్తులు ఉంటాయి.  పరిపూర్ణ హక్కులు ఉన్న యజమాని నుంచి మాత్రమే ఆస్తులను విక్రయించే హక్కులు ఉంటాయి.

Property Purchase: స్థిరాస్తి కొంటున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి… లేకపోతే నష్టపోతారు…!

Thursday, October 10, 2024

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

Tirumala Hanumantha Vahanam: కోదండరాముని అవతారంలో హనుమంత వాహనంపై శేషాచలాధీశుడు, కన్నుల పండుగగా తిరుమల బ్రహ్మోత్సవాలు

Wednesday, October 9, 2024

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం  ముఖ భాగాన్ని వేంకటాద్రి అని, మధ్య భాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.

Tirumala Venkateswara: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు…ముక్తిప్రదములు ఏడు, బ్రహ్మోత్సవాల్లో వీటిని సందర్శించండి..

Wednesday, October 2, 2024

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం బుధవారం బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

AP TG Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలో ఓ మోస్తరు వానలు

Thursday, September 26, 2024

కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లను శుభ్రం చేస్తున్న దృశ్యం

Pawan Prayaschittam: దుర్గగుడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త పూజలు, అక్టోబర్‌ 2న తిరుమలలో దీక్ష విరమణ

Tuesday, September 24, 2024

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం విషయంలో ఎంపికల ప్రక్రియ కొలిక్కి రాలేదు. టీటీడీ ఛైర్మన్‌ పదవి విషయంలో ఎవరికి భరోసా ఇచ్చే పరిస్థితి లేనందున, అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఛైర్మన్‌, పాలక మండలిని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

TTD Chairman Issue: కొలిక్కి రాని టీటీడీ ఛైర్మన్‌, బోర్డు సభ్యుల నియామకం..అంతు చిక్కని చంద్రబాబు అంతరంగం

Monday, September 23, 2024

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు శాండ్ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లో ఇసుకను నేరుగా బుక్ చేసుకోవచ్చు.

AP Free Sand Portal: అందుబాటులోకి ఏపీ ఫ్రీ శాండ్ పోర్టల్.. నేటి నుంచి ఆన్‌లైన్ బుకింగ్..

Friday, September 20, 2024

ప్రకృతివిపత్తులు, ఆకస్మికంగా సంభవించే మార్పులు, వాతావరణ సూచనలు మనుషుల కంటే  పశుపక్ష్యాదులు, వన్యమృగాలకే ముందు తెలుస్తాయని మరోసారి రుజువైంది.

Natures Secret: అంతుచిక్కని ప్రకృతి రహస్యం.. ములుగు అడవుల్లో వందల ఎకరాల్లో చెట్లు కూలినా ఒక్క జీవి ప్రాణం పోలేదు..

Thursday, September 19, 2024

హోల్‌ సేల్ వ్యాపారులు పాత స్టాకును కూడా కొత్త ధరలకు అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడితే కేసుల నమోదుతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

Edible Oil Prices: ఏపీలో భారీగా పెరిగిన వంట నూనెల ధరలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్‌, అక్రమ వ్యాపారులపై కేసుల నమోదు

Wednesday, September 18, 2024

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు.

Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

Wednesday, September 11, 2024