Vijay Devarakonda : పాపులారిటీతో సమస్యలొస్తాయ్-vijay devarakonda comments after ed investigation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vijay Devarakonda : పాపులారిటీతో సమస్యలొస్తాయ్

Vijay Devarakonda : పాపులారిటీతో సమస్యలొస్తాయ్

HT Telugu Desk HT Telugu

ED Questions Vijay Devarakonda : నటుడు విజయ్ దేవరకొండ ఈడీ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. సుమారు 11 గంటలపాటు ఆయనను అధికారులు విచారించారు.

విజయ్ దేవరకొండ (ANI)

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)ను ఈడీ అధికారులు సుమారు 11 గంటలపాటు విచారణ చేశారు. విచారణ అనంతరం.. విజయ్ దేవరకొండ మాట్లాడారు. మనకొచ్చే పాపులారిటీతో కూడా కొన్ని సమస్యలొస్తాయ్.. వాటిల్లో ఇది ఒకటి.. అని అన్నారు. 'మీరు చూపించే అభిమానంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ఇదొక అనుభవం వచ్చింది. అధికారులకు పూర్తిగా సహకరించాను. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మళ్లీ రమ్మని చెప్పలేదు.' అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.

లైగర్ సినిమా(Liger Movie) లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు విజయ్ ను విచారించారు. పలు కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు 11 గంటలపాటు విచారణ చేశారు. లైగర్ సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు మనీలాండరింగ్ చేశారనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఫెమా కింద కాకుండా PMLA కింద కేసు నమోదు అయింది. పీఎంఎల్‌ఏ(Prevention of Money Laundering Act) సెక్షన్ 50 కింద నటుడు విజయ్ దేవరకొండ స్టేట్‌మెంట్‌(Statement)ను నమోదు చేశారు అధికారులు.

ఇటీవలే దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannath), నటి ఛార్మి(Charmy)ని ఈడీ అధికారులు(ED Officials) ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేశారు. 12 గంటలు పాటు విచారణ జరిగింది. లైగర్ సినిమా లావాదేవీల విషయంలో మనీలాండరింగ్ అంశంపై విచారణ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించి.. విచారణ చేస్తోంది.

ఆ రోజు ఉదయం 8 గంటలకు పూరి, ఛార్మి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుమారు 12 గంటల పాటు విచారణ జరిగింది. దుబాయ్ కి డబ్బులు పంపించి.. అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఈడీ గుర్తించింది. అయితే ఇందులో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. లైగర్(Liger) సినిమా నిర్మించేందుకు విదేశాల నుంచి అధిక మెుత్తంలో డబ్బులు వీరు అందుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. డబ్బులు ఎందుకు జమ చేశారు? ఎవరు పంపించారనే అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారని అంటున్నారు.

లైగర్ సినిమా పాన్ ఇండియా(Pan India) సినిమాగా రూపొందించారు. బడ్జెట్ భారీగా అయింది. మైక్ టైసన్ కూడా నటించారు. అయితే సినిమా అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లింపు విషయంలోనూ వివాదం నడిచింది. పూరి జగన్నాథ్ ఆడియో(Puri Jagannath Audio) ఒకటి బయటకు కూడా వచ్చింది.