Trains Cancelled : డబ్లింగ్ పనులతో మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్ల రద్దు…
మహారాష్ట్రలోని బిగ్వాన్-వాషింబే స్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 36 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 8 రైళ్లను దారి మళ్లించారు. ఆరు రైళ్ల గమ్యస్థానాలను కుదించారు.
రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా మహారాష్ట్ర వైపు ప్రయాణించే పలు రైళ్లును ఆగష్టు 4 నుంచి పదో తేదీ మధ్య రద్దు చేశారు. హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై ఎక్స్‌ప్రెస్ (17032) ను ఆగస్టు 4-8 మధ్య రద్దు చేయగా, తిరుగు ప్రయాణంలో అదే రైలు (17031)ను ఆగస్టు 5-9 మధ్య రద్దు చేశారు. సికింద్రాబాద్-రాజ్‌కోట్ (22718) మధ్య ప్రయాణించే రైలును ఆగస్టు 6,8,9 తేదీల్లో రద్దు చేయగా, అటునుంచి వచ్చే రైలు (22717)ను 8,10, 11 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాకినాడ పోర్టు-ఎల్‌టీటీ ముంబై (17221), ఎల్‌టీటీ ముంబై-కాకినాడ పోర్టు (17222) రైళ్లను ఆగస్టు 4, 7 తేదీల్లో రద్దు చేశారు.
ఇండోర్-లింగపల్లి (20916) రైలును ఆగస్టు 6న, లింగంపల్లి నుంచి ఇండోర్ వెళ్లే రైలు (20915)ను 7న రద్దు చేశారు. పోర్‌బందర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (19202)ను ఆగస్టు 9న, సికింద్రాబాద్-పోర్‌బందర్ రైలు (19201) ను ఆగస్టు 10న రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి హదాప్సర్ వెళ్లాల్సిన రైలు (17014)ను ఆగస్టు 4,6,8 తేదీల్లో కుర్దావాడి స్టేషన్‌కు కుదించారు. అదే రైలు తిరుగు ప్రయాణంలో ఆగస్టు 5,7,9 తేదీల్లో కుర్దావాడి స్టేషన్ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు.
రద్దైన రైళ్లలో ట్రైన్ నంబర్లు 22159, 22160, 17032, 17031, 16382, 16381, 22718, 22717, 17221, 17222, 16229, 16230, 11017, 11018, 22101, 22102, 22179, 22180, 12755, 12756, 16614, 16613, 82653, 82654, 20916, 20915, 22920, 22919, 20954, 20953, 20919, 20920, 19202, 19201, 19568, 19567 గా ఉన్నాయి.
ట్రైన్ నంబర్ 18520, 16331, 16331, 16351, 18519, 16332, 16340, 16352 రైళ్లను దారి మళ్లించారు. ట్రైన్ నంబర్ 11302, 11301, 17014, 17013, 17614, 17613లను పాక్షికంగా దారి మళ్లించారు.
టాపిక్