TGPSC Jobs 2024 : టీజీపీఎస్సీలో ఉద్యోగాలు - నెలకు జీతం రూ. 60 వేలు, ముఖ్య తేదీలివే-telangana state public service commission invites applications for legal experts jobs 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Jobs 2024 : టీజీపీఎస్సీలో ఉద్యోగాలు - నెలకు జీతం రూ. 60 వేలు, ముఖ్య తేదీలివే

TGPSC Jobs 2024 : టీజీపీఎస్సీలో ఉద్యోగాలు - నెలకు జీతం రూ. 60 వేలు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 03, 2024 04:22 PM IST

TGPSC Latest News : టీజీపీఎస్సీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విధానంలో లీగల్ ఎక్స్‌పర్ట్, సీనియర్ కౌన్సెల్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీపీఎస్సీలో  ఉద్యోగాలు
టీజీపీఎస్సీలో ఉద్యోగాలు

Telangana State Public Service Commission : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా….లీగల్ ఎక్స్‌పర్ట్, సీనియర్ కౌన్సెల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం కలిపి 4 ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. జులై 15వ తేదీలోపు అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్.
  • మొత్తం ఖాళీలు - 04
  • ఖాళీల వివరాలు - లీగల్ ఎక్స్‌పర్ట్ - 03, సీనియర్ కౌన్సెల్‌ - 01 పోస్టు.
  • కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేస్తున్నారు.
  • అర్హతలు - ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం ఉత్తీర్ణతతో ఉండాలి. మూడేళ్ల స్టాండింగ్ ఉండాలి. సర్వీస్ మ్యాటర్స్ లో పని అనుభవం తప్పనిసరి.
  • జీతం - నెలకు రూ.60,000.
  • దరఖాస్తు విధానం - ఆఫ్‌లైన్‌ లో సమర్పించాలి.
  • దరఖాస్తు లింక్ - https://websitenew.tspsc.gov.in/
  • పూర్తి చేసిన దరఖాస్తులను, ధ్రువపత్రాలతో సహా టీజీపీఎస్సీ, నాంపల్లి కార్యాలయంలో సమర్పించాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ - జులై 15, 2024.
  • ఏమైనా సందేహాలు ఉంటే 7288896631 ఫోన్ నెంబర్( ఎస్, సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ ) ను సంప్రదించవచ్చు.

వైద్యారోగ్యశాఖలో 435 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

తెలంగాణ‌ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జులై 2వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm  వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం.
  • మొత్తం ఖాళీలు - 435 ( సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్)
  • అర్హతలు - ఎంబీబీఎస్ పాటు పాటు తగిన అర్హతలు ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
  • వయసు - 18 నుంచి 46 ఏళ్ల లోపు ఉండాలి.
  • జీతం - రూ. 58,850 – రూ. 1,37,050
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో
  • దరఖాస్తులు ప్రారంభం - జూలై 2 , 2024 నుంచి ప్రారంభం
  • దరఖాస్తులకు చివరి తేదీ - జూలై 11, 2024.
  • దరఖాస్తు రుసుం - రూ. 500 , ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in/ 

Whats_app_banner