TG SSC Supplementary Results 2024 : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్ తో చెక్ చేసుకోండి-telangana ssc supplementary results 2024 out at https bse telangana gov in direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Supplementary Results 2024 : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్ తో చెక్ చేసుకోండి

TG SSC Supplementary Results 2024 : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్ తో చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 28, 2024 04:28 PM IST

TG SSC Advanced Supplementary Results 2024 : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. SSC బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2024
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2024

TG Advanced SSC Supplementary Results 2024 : తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://bse.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్స్ ను చెక్ చేసుకోవచ్చు.

జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తంగా 73.03 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత 71.01 శాతం, బాలికల ఉత్తీర్ణత 76.37 శాతంగా ఉంది. ఈ ప‌రీక్ష‌ల‌కు 51,272 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా… , 46,731 మంది హాజ‌ర‌య్యారు.

రీకౌంటింగ్ కోసం జులై 8వ తేదీలోపు ఫీజులు చెల్లించాలి. ఎస్బీఐ చ‌లాన్‌తో పాటు ద‌ర‌ఖాస్తును పదో తరగతి బోర్డులోనే స‌మ‌ర్పించాలి. ఒక్కో స‌బ్జెక్ట్‌కు రూ. 500 చొప్పున చెల్లించాలి.

టీఎస్ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  • https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే S.S.C ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS , JUNE - 2024  ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ రోల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
  • క్లిక్ బటన్ పై నొక్కితే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • ఇంటర్ లేదా ఇతర అడ్మిషన్ ప్రక్రియలో మెమో చాలా కీలకం.

తెలంగాణలో పదో తరగతి రెగ్యూలర్ పరీక్షలు(TS 10th Exams) మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు.

పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 4,94,207మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా, మరో 11,606మంది విద్యార్ధులు ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యారు.

పదో తరగతి రెగ్యూలర్ పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 91.31శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలురలో 89.42శాతం, బాలికల్లో 93.23శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత బాలురకంటే 3.81శాతం అధికంగా ఉంది. రెగ్యూలర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేశారు.

Whats_app_banner