Paddy : రబీలో ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల వరి ధాన్యం కొన్నదంటే?-telangana spends rs 9726 cr to procure 5 mn tonnes of paddy from farmers in rabi know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Paddy : రబీలో ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల వరి ధాన్యం కొన్నదంటే?

Paddy : రబీలో ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల వరి ధాన్యం కొన్నదంటే?

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 03:22 PM IST

రబీలో రైతుల నుంచి 5 మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం రూ.9,726 కోట్లను వెచ్చించింది.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

రబీ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి రూ.9,726 కోట్ల విలువైన వరిని కొనుగోలు చేసింది. ఇది దాదాపు ఐదు మిలియన్ టన్నులు. గత సంవత్సరం(2020-21) కేసీఆర్ ప్రభుత్వం 21 లక్షల మంది రైతుల నుండి 26,610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 14.1 మిలియన్ టన్నుల వరిని సేకరించింది.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లలో రైతుల నుంచి దాదాపు రూ.98,000 కోట్ల విలువైన 55 మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేసింది. వరి సాగులో పంజాబ్‌ను వెనక్కి నెట్టి దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటోంది తెలంగాణ. గత ఎనిమిదేళ్లుగా రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలతో ‘భారతదేశ ధాన్యాగారం’గా అవతరిస్తోందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.720 కోట్లకు పైగా ఖర్చు చేసి రేషన్ కార్డుదారులకు నెలకు 10-12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. అదేవిధంగా జూన్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు రేషన్ కార్డు హోల్డర్లకు నెలకు 10 కిలోలు అదనంగా ఇచ్చాురు. దీని ధర రూ.421.33 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.

2020–21లో వానాకాలం, యాసంగి కలిపి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధాన్యం విలువ 26 వేల 610 కోట్లు ఉంటుందని పేర్కొంది.  ఈ యాసంగిలో ఇప్పటివరకు 6 వేల 609 కొనుగోలు కేంద్రాల ద్వారా 9వేల 726 కోట్ల విలువైన 49.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది.

దేశానికి అత్యధిక ధాన్యాన్ని అందించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్‌ మొదటి స్థానంలో ఉంది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) 2021-22లో తెలంగాణ నుంచి ఇప్పటివరకు 1.18 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత వానకాలం సీజన్‌లో 70.22 లక్షల టన్నులు, ప్రస్తుత యాసంగిలో 48 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఇంకా ధాన్యం కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం