Telangana Pre Poll Survey : మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం, 76 స్థానాల్లో విజయం-మిషన్ చాణక్య సర్వే-telangana pre poll mission chanakya survey brs came to power again congress second place ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Pre Poll Survey : మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం, 76 స్థానాల్లో విజయం-మిషన్ చాణక్య సర్వే

Telangana Pre Poll Survey : మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం, 76 స్థానాల్లో విజయం-మిషన్ చాణక్య సర్వే

Bandaru Satyaprasad HT Telugu
Oct 22, 2023 02:01 PM IST

Telangana Pre Poll Survey : ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే అధికారమని మిషన్ చాణక్య సర్వే స్పష్టంచేసింది. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల అనంతరం మహిళల మద్దతు తెలిపిందని వెల్లడించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Telangana Pre Poll Survey : తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదే అని మిషన్ చాణక్య సర్వే వెల్లడించింది. ఆదివారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో నా రాష్ట్రం-నా ఓటు- నా నిర్ణయం అనే నినాదంలో మిషన్ చాణక్య సర్వే ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో మిషన్ చాణక్య సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించిన మిషన్ చాణక్య...గత నాలుగు నెలలుగా విస్తృతంగా అధ్యయనం చేసి డేటాను విశ్లేషించింది. ఆదివారం పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టును విడుదల చేసింది.

బీఆర్ఎస్ కు 76 సీట్లు

బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై 85 శాతం ప్రజల సంతృప్తిగా ఉన్నారని సర్వేలో తేలిందని నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇది కేవలం 44 శాతమే ఉందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మహిళా ఓటర్ల నుంచి భారీగా సానుకూల స్పందన పెరిగిందని సర్వేలో వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ పార్టీ కనీసంగా 76 స్థానాలకుపైగా గెలుచుకుంటుందన్నారు. అన్ని వయసుల ఓటర్లలో ఎక్కువ మంది బీఆర్‌ఎస్‌ పై సుముఖంగా ఉన్నారని తెలిపింది.

ఓట్ల శాతం

  • బీఆర్ఎస్ - 44.2 శాతం
  • కాంగ్రెస్ - 32.7 శాతం
  • బీజేపీ- 17.6 శాతం
  • ఇతరులు - 5 శాతం

ఇండియా టుడే- సీఓటర్ సర్వే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రీ పోల్ సర్వేలు ఒక్కో విధంగా చెబుతున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయంటుంటే, మరికొన్ని సర్వేలు మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం అంటున్నాయి. ఇటీవల విడుదలైన ఇండియా టుడే - సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఆ రోజు ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయో తెలియదు కానీ.. ఇండియా టుడే - సీఓటర్ సర్వే లో మాత్రం అనూహ్యమైన ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలుస్తుందని, అధికార బీఆర్ఎస్ రెండో స్థానంలోనే నిలుస్తుందని పేర్కొంది.

కాంగ్రెస్ కు 54 సీట్లు

  • 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది.
  • 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.
  • గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన బీజేపీ...ఈ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకునే అకాశం ఉందని వివరించింది.
  • 2018 ఎన్నికల్లో ఇతరులు 11 మంది గెలవగా.... ఈ ఎన్నికల్లో 8 మంది వరకు గెలవొచ్చని అంచనా వేసింది.

Whats_app_banner