Telangana: ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్... 90 శాతం వడ్డీ మాఫీ-telangana govt key decision on property taxes of all municipalities ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Govt Key Decision On Property Taxes Of All Municipalities

Telangana: ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్... 90 శాతం వడ్డీ మాఫీ

ఆస్తి పన్ను బకాయిలపై తెలంగాణ సర్కార్ ఆదేశాలు,
ఆస్తి పన్ను బకాయిలపై తెలంగాణ సర్కార్ ఆదేశాలు, (HT)

ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం జీవో నెం.485ను విడుదల చేసింది.

Property Tax in Telangana: ఆస్తిపన్ను బకాయిదారులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఓటీఎస్‌(వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీం)ను ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 31తో ఈ గడువు ముగియనుంది.

ట్రెండింగ్ వార్తలు

2021-22 ఏడాది వరకు ఉన్న బకాయిలను 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ బకాయిలను పూర్తి వడ్డీతో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జులై 16 మధ్య చెల్లించి ఉంటే.. వారికీ ఓటీఎస్‌ వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించింది. వారు చెల్లించిన వడ్డీలో 90 శాతాన్ని తిరిగి వెనక్కి ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆస్తిపన్ను డిమాండ్‌లో సర్దుబాటు చేస్తారు. 2020 ఆగస్టులో కూడా తెలంగాణ సర్కార్... ఇదే మాదిరి ఓటీఎస్‌ పథకాన్ని తీసుకొచ్చింది.

ఇక రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో రూ.1626.83 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. వీటిని వసూలు చేసేందుకు ఓటీఎస్‌ (వన్‌ టైం స్కీం)ను తీసుకువచ్చింది. అక్టోబరు 31 తేదీలోపు చెల్లించే వారికి ఈ పథకం వర్తించనుంది. ఇప్పటివరకు సుమారు రూ.4కోట్ల మేర వడ్డీ బకాయిలు ఉండగా... 90శాతం వడ్డీ మాఫీ స్కీం ద్వారా రూ.3.60కోట్లు వడ్డీ మాఫీ కానుంది.

WhatsApp channel