T Congress Meeting : భట్టి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ….-telangana congress leaders meeting in clp leader mallu bhatti vikramarka house ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress Meeting : భట్టి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ….

T Congress Meeting : భట్టి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ….

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 12:05 PM IST

T Congress Meeting తెలంగాణ పిసిసి కమిటీల కూర్పుతో మొదలైన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కమిటీల ప్రకటనపై ఒక్కొక్కరుగా నిరసన స్వరాలు వినిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క నివాసంలో టీ కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. సమావేశ లక్ష్యం ఏమిటనేది ప్రకటించకపోయినా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యమ్ ఠాకూర్ లక్ష్యంగా సమావేశం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీ కాంగ్రెస్‌ కమిటీల కూర్పుపై రగడ
టీ కాంగ్రెస్‌ కమిటీల కూర్పుపై రగడ

T Congress Meeting తెలంగాణలో పిసిసి పదవుల పంపకంపై తలెత్తిన వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై రగిలిపోతున్న కాంగ్రెస్‌ నాయకులు తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. సిఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. భట్టి విక్రమార్క నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర్ రాజ నరసింహ, కోదండరెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

పీసీసీ కమిటీల కూర్పుపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో తలెత్తిన అసంతృప్తులు చల్లారలేదు. మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌తో పాటు పలువురు నేతలు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. పిసిసి వేసిన కమిటీల్లో పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పదవులు దక్కలేదని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

పిసిసి పదవుల్ని ప్రకటించిన తర్వాత ఆ కమిటీల కూర్పు వ్యవహారంలో తనకు ఎలాంటి సమాచారం లేదనిసిఎల్పీ నేతల మల్లు భట్టవిక్రమార్క చెప్పారు. కమిటీ కూర్పు సాధారణంగా పిసిసి అధ్యక్షుడు, సిఎల్పీ నాయకుడు కలిసి చేపడతారు. అయితే పార్టీలో ఎవరి ప్రమేయం లేకుండా రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేసిన మర్నాడే మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ కూడా కమిటీ కూర్పు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో 2014 నుంచి కోవర్టు రాజకీయాలు పెరిగిపోయాయని, పార్టీలో కోవర్టుల్ని గుర్తించాలంటూ ఆరోపించారు. దీంతో కోవర్టులు ఎవరో వెల్లడించాలని ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా స్వరం కలిపారు. తాాజాగా భట్టి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భేటీ కావడంతో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరుగుతోంది.

భట్టి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు భేటీ కావడం ఎవరిని టార్గెట్ చేయడం కోసమనే సందేహాలు కూడా లేకపోలేదు. మొదట్నుంచి కాంగ్రెస్‌కు పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదని అక్రోశం వ్యక్తమవుతోంది. పిసిసి నాయకుడు రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌ఛార్జి మాణిక్యమ్ ఠాకూర్‌లపై నేతల్లో ఆగ్రహంతో రగిలిపోతుననారు. మాణిక్యమ్ ఠాకూర్‌ వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనే యోచన కూడా చేస్తున్నారు. సిఎల్పీ నాయకుడ్ని సైతం సంప్రదించకుండా కమిటీలను ప్రకటించడంపై అధిష్టానంతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

తమతో సంప్రదించకుండానే కమిటీలను ఏర్పాటు చేశారని పార్టీ సీనియర్లు రగిలిపోతుడటంతో పార్టీ పరిస్థితిపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. నాయకులు అందరిని సమన్వయం చేయాల్సిన పని చేయట్లేదని ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యాచరణపై ఎలాంటి కసరత్తు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన కమిటీల్లో జనరల్ సెక్రటరీ పదవిని అనర్హులకు కేటాయించడంపై కూడా నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పొలిటికల్ అఫైర్స్‌ కమిటీలో చోటు దక్కకపోవడంపై మహేశ్వర్‌ రెడ్డి వంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి కమిటీలలో పార్టీ నాయకుల కూర్పు, సమన్వయంపై చర్చిస్తున్నారు.

Whats_app_banner