V2X Communication | ఇక కార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుతాయి.. ఎలానో తెలుసా?-suzuki motors maruti suzuki iit hyderabad showcase demo of vehicle to everything communication technology ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  V2x Communication | ఇక కార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుతాయి.. ఎలానో తెలుసా?

V2X Communication | ఇక కార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుతాయి.. ఎలానో తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 24, 2022 02:26 PM IST

కొన్ని రోజుల్లో కార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అదేంటి అనుకుంటున్నారా? అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కమ్యూనికేట్ చేసుకుంటాయన్నమాట. ఈ ప్రదర్శనకు హైదరబాద్ వేదికైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఉపయోగించే.. వీ2ఎక్స్​ టెక్నాలజీని సుజుకి మోటార్ కార్పొరేషన్ హైదరాబాద్​ ఐఐటీలో ఇటీవలే ప్రదర్శించింది. మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్​ఐఎల్​) ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్​) ఫ్యూచరిస్టిక్ వీ2ఎక్స్, క్యాప్​జెమినీతో కలిసి డెవెలప్​ చేశారు. కారులోని వెనక భాగంలో రూటర్​వంటి డివైజ్​ను పెడతారు. ఇది 5జీ లేదా వెహికల్​ టూ వెహికల్​ డేటా ట్రాన్స్​ఫర్​ టెక్నాలజీ ద్వారా వర్క్ చేస్తుంటుంది. కారు సమీపంలో ఎవరైనా తప్పుగా​ డ్రైవ్​ చేసినా, అంబులెన్స్​ వచ్చినా, రోడ్డు బాగా లేకున్నా కారులోని స్క్రీన్​పై కనిపిస్తుంది. అదే సమయంలో డ్రైవర్ ను అలర్ట్ చేస్తుంది. 5జీ టెక్నాలజీ లేని చోట డేటా ట్రాన్స్​ఫర్​ సిస్టమ్​ ద్వారా కూడా పనిచేస్తుంది. అంటే నెట్​ లేకున్నా పనిచేస్తుందన్న మాట.

రవాణా మరియు మొబిలిటీ పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి వాహన కమ్యూనికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. ఆటో-డ్రైవింగ్ మరియు ఇంటెలిజెంట్ మొబిలిటీని ఏకీకృతం చేయడంలో V2X కీలక పాత్ర పోషిస్తుంది, ఇది ప్రమాదాలను అరికట్టడంలో మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. V2X కమ్యూనికేషన్ తో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను తగ్గించొచ్చు.

అంబులెన్స్ అలర్ట్ సిస్టమ్: V2X కమ్యూనికేషన్‌ని ఉపయోగించి సమీపించే అత్యవసర వాహనం గురించి అలర్ట్ వస్తుంది. ఈ విషయం డ్రైవర్‌లకు తెలుస్తుంది. అంబులెన్స్‌లకు మార్గం క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. అలర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాల మధ్య దూరం వంటి నిమిషాల వివరాలను కూడా పంచుకుంటుంది.

రాంగ్-వే అలర్ట్ సిస్టమ్: ఈ సాంకేతికత రాంగ్-వే డ్రైవర్‌లను గుర్తిస్తుంది. ఈ కారణంగా హెచ్చరికలు వస్తాయి.

పాదచారుల హెచ్చరిక వ్యవస్థ: వెళ్తున్న కారుకు సమీపంలో పాదచారులు దాటుతున్నప్పుడు V2X ద్వారా అలర్ట్ వస్తుంది. డ్రైవర్లు ముందు జాగ్రత్త చర్యలను తీసుకునేందుకు ఉపయోగపడతుంది.

మోటార్‌సైకిల్ అలర్ట్ సిస్టమ్: దగ్గర నుంచి వేగంగా కదులుతున్న 2-వీలర్‌లు, అంతేగాకుండా.. ఢీకొనే అవకాశం ఉన్న వాహనాల గురించి డ్రైవర్ కు ఈ సాంకేతిక ద్వారా.. తెలుస్తుంది. దూరం, ఎటువైపు దిశ తీసుకోవాలో అలర్ట్ చేస్తుంది.

రోడ్ కండిషన్ అలెర్టింగ్ సిస్టమ్: కారులో వెళ్తుంటే.. దారి సరిగా లేకపోతే.. ఈ టెక్నాలజీ డ్రైవర్ ను అలర్ట్ చేస్తుంది. డ్రైవర్‌ జాగ్రత్తగా ముందుకు నడపాలని సూచనలు చేస్తుంది.

'ఇండియాలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్​ రూల్స్​ వయొలేషన్స్​ చాలా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం కార్లకు ఎయిర్​బ్యాగ్స్​ను తప్పనిసరి చేసింది. వీ2ఎక్స్​ టెక్నాలజీని కూడా తప్పనిసరి చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ టెక్నాలజీ డెవెలప్​మెంట్​ మొదటిదశలో ఉంది. మార్కెట్లోకి రావడానికి కొన్నేళ్లు పడుతుంది. యూరప్​ వంటి దేశాల్లో వీ2ఎక్స్​ను ఇది వరకే ఉపయోగిస్తున్నారు.' సుజుకీ ప్రతినిధులు చెప్పారు.

 

IPL_Entry_Point

టాపిక్