Yoga Day : క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన దూత పరమహంస యోగానంద-special story on kriya yoga ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yoga Day : క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన దూత పరమహంస యోగానంద

Yoga Day : క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన దూత పరమహంస యోగానంద

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 06:45 PM IST

సమకాలీన యుగంలో యోగా విజ్ఞానశాస్త్రం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక ప్రపంచం మరింత ఎక్కువగా గుర్తిస్తోంది. జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడమే ఇందుకు ఉదాహరణ.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కళాఖండంగా కొనియాడిన ఒక యోగి ఆత్మకథ పుస్తక రచయిత పరమహంస యోగానంద యోగంలోని నిగూఢమైన విషయాలను పాశ్చాత్య దేశాలకు తెలియజేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆయన చేసిన యోగ ధ్యాన బోధనలు విస్తృతంగా ప్రాచుర్యం పొంది.. ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. నేడు యోగానంద పడమటి దేశాలలో యోగా పితామహుడిగా గుర్తింపు పొందారు.

యోగం అనే పదానికి అర్థం ‘ఐక్యత’. పరమాత్మతో అటువంటి కలయిక ప్రతి ఒక్క మానవుడిలో సహజసిద్ధమైనది. అది అతడి ఉన్నతమైన లక్ష్యం కూడా అనే వాస్తవాన్ని మహాత్ములందరూ స్వీకరించారు. సహజంగా ఆ లక్ష్యానికి దారితీసే దాని మార్గమైన ధ్యానాభ్యాసం, మానవుడు పరమాత్మునితో అనుసంధానం పొందగలిగే ఏకైక పద్ధతి.

నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు, యోగ కేవలం ఒక శారీరక వ్యాయామాల సమూహం మాత్రమే కాదని అభిప్రాయపడుతున్నారు. వాస్తవమైన ఆంతరిక విజయాలకు దారితీసే మార్గాన్ని చూపిస్తుందని, ఆ మార్గం చివరికి ఆత్మసాక్షాత్కారమనే లక్ష్యానికి నడిపిస్తుందని కనుగొంటున్నారు.

పతంజలి మహర్షి తన గ్రంథంలో తెలియజేసిన అష్టాంగయోగ మార్గాన్ని అనుసరించిన వ్యక్తి అంతిమ లక్ష్యాన్ని తప్పక సాధిస్తాడు. క్రియాయోగం గురించి భగవద్గీత ప్రత్యేకంగా పేర్కొంది.

క్రియాయోగం యోగంలోని ఒక ప్రత్యేకమైన విభాగం.. దీనిని యోగానందజీ ప్రముఖంగా చూపించి., తన బోధనల ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. క్రియాయోగం ఒక సరళమైన మనో-భౌతిక విధానం. అది మానవ రక్తంలోని కర్బనాన్ని తొలగించి, దానిని ప్రాణవాయువుతో నింపుతుంది. కానీ క్రియాయోగం యొక్క నిజమైన ప్రయోజనం దాని ఆధ్యాత్మిక విలువలో ఉంది. ఎందుకంటే అది క్రమబద్ధంగా సాధన చేసే సాధకునికి ఆత్మసాక్షాత్కారం వైపు పురోగమించేందుకు సమర్థునిగా చేస్తుంది.

యోగానంద గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి తన శిష్యుణ్ణి ‘జగద్గురువు’ పాత్ర పోషించేందుకు సిద్ధం చేయడానికి కారణమయ్యారు. యుక్తేశ్వర్ కి ఆయన గురువైన లాహిరీ మహాశయులు క్రియాయోగ దీక్షను ప్రదానం చేశారు. లాహిరీ మహాశయుడు అమరుడైన బాబాజీని కలిసిన అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన, నాటకీయమైన సంఘటన ఒక యోగి ఆత్మకథలో వివరంగా వర్ణించారు. ఆ చిరస్మరణీయ సమావేశ ఘట్టంలో బాబాజీ అంధయుగాలలో ప్రపంచం కోల్పోయిన సనాతన శాస్త్రమైన క్రియాయోగాన్ని పునరుద్ధరించడానికి తన ప్రధాన శిష్యుడిని సన్నద్ధం చేశారు. చిత్తశుద్ధి గల భక్తులందరికీ క్రియాయోగ దీక్షను ప్రదానం చేయడానికి లాహిరీ మహాశయుడిని అనుమతించారు.

అప్పటి నుంచి ఆ సాంప్రదాయం వందేళ్ళ క్రితం యోగానందజీ స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. యోగానంద ఆత్మకథలో ఆయన రాసిన ఆఖరి పలుకులు క్రియాయోగ మార్గంలో చిత్తశుద్ధితో సాధన చేసేందుకు కావలసిన చిరస్మరణీయమైన ప్రేరణను మనకు అందిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం