Hyderabad Rains: హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం-rain lashes parts of hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains: హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం

Hyderabad Rains: హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం

HT Telugu Desk HT Telugu
Sep 09, 2022 04:38 PM IST

హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తున్న‌ది. మరోవైపు వినాయన నిమజ్జనం వర్షంలోనే కొనసాగుతున్నది.

<p>పలు ప్రాంతాల్లో వర్షం</p>
పలు ప్రాంతాల్లో వర్షం

Rains in Hyderabad City:తెలంగాణలో మూడు రోజులు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడుతుంది. నగరంలో బుధవారం నుంచి అకస్మాత్తుగా వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇదిలా ఉంటే ఇవాళ కూడా ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో చార్మినార్ వద్ద భారీ స్థాయిలో పడింది. గోల్కొండ‌, మ‌ల్లేప‌ల్లి,గండిపేట్‌, మెహిదీప‌ట్నం, రాజేంద్ర‌న‌గ‌ర్‌, శంషాబాద్‌, కార్వాన్‌, లంగ‌ర్‌హౌస్‌, అత్తాపూర్‌, బండ్ల‌గూడ‌లో మోస్త‌రు వ‌ర్షం ప‌డింది. హుస్సేన్‌సాగ‌ర్ ప‌రిస‌రాల్లోనూ వ‌ర్షం కురుస్తున్న‌ది. ప‌లుచోట్ల రోడ్ల‌పై వర్షం నిలువ‌డంతో వాహ‌నాలు స్తంభించాయి. వ‌ర్షాల కార‌ణంగా ప‌లుప్రాంతాల్లో గ‌ణ‌నాథులు మండ‌పాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి.

కొనసాగుతున్న నిమజ్జనం

మరోవైపు వ‌ర్షంలోనే గ‌ణేషుడి శోభ‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ శోభయాత్ర ఘనంగా కొనసాగుతోంది. బాలాపూర్ గణనాథుడు కూడా చార్మినార్ దాటారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాలోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వాతావరణ శాఖ వివరించింది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. .

Whats_app_banner

సంబంధిత కథనం