Ramanujacharya Statue| హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఫిబ్రవరి 5న రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ..
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించారు త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. ఈ ఉత్సవాలకు ప్రధాని మోడీ ఫిబ్రవరి 5న రానున్నారు.
శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపం ముచ్చింతల్ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 12 రోజులపాటు సమతామూర్తి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఉత్సవాలకు రానున్న ప్రముఖులు..
ఫిబ్రవరి 5: ప్రధాని మోడీ
ఫిబ్రవరి 6: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఫిబ్రవరి 7: రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
ఫిబ్రవరి 8: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఫిబ్రవరి 9: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఫిబ్రవరి 13: రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉత్సవాలకు హాజరుకానున్నారు. కానీ తేదీ ఇంకా నిర్ణయించలేదు.
త్రిదండి చిన్న జీయర్ స్వామి ఢిల్లీ పర్యటనకు గతంలో స్వయంగా ప్రముఖులను ఆహ్వానించారు. ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో రూ.1,000 కోట్లతో నిర్మించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. 13న రామానుజాచార్య బంగారుమూర్తి విగ్రహాన్ని సైతం ప్రతిష్టించేలా ప్రణాళికలు చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవద్రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి.
ప్రధాన కార్యక్రమాలు
ఫిబ్రవరి 3న అగ్ని ప్రతిష్ఠ, అష్టాక్షరి జపం
ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ
ఫిబ్రవరి 8న ఆదిత్య హృదయం పారాయణం
ఫిబ్రవరి 11న సామూహిక ఉపనయనం
ఫిబ్రవరి 12న విష్ణు సహస్రనామ పారాయణం
ఫిబ్రవరి 13న రామానుజాచార్య బంగారుమూర్తి విగ్రహం ఆవిష్కరణ
ఫిబ్రవరి 14న మహాపూర్ణాహుతి
సంబంధిత కథనం