తెలుగు న్యూస్ / తెలంగాణ /
Nalgonda District : చింతపల్లి వద్ద బస్తు బోల్తా.. ఒకరు మృతి, 25 మందికి గాయాలు
Nalgonda District News: చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండలో పెళ్లికి హాజరై తిరిగి హైదరాబాదు వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.
చింతపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Nalgonda District News:నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి పెళ్లికి హాజరై తిరిగి హైదరాబాదు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టాపిక్
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.