Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాదానికి అసలు కారణమేంటి? రంగంలోకి క్లూస్ టీమ్!-nampally news in telugu fire accident clue team gathering samples identify reason ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాదానికి అసలు కారణమేంటి? రంగంలోకి క్లూస్ టీమ్!

Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాదానికి అసలు కారణమేంటి? రంగంలోకి క్లూస్ టీమ్!

Bandaru Satyaprasad HT Telugu
Nov 14, 2023 06:07 PM IST

Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాదంపై 10 మందితో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా క్రాకర్స్ కారణమో తెలియాల్సి ఉందన్నారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నాంపల్లి అగ్ని ప్రమాదం
నాంపల్లి అగ్ని ప్రమాదం

Nampally Fire Accident : హైదరాబాద్ నాంపల్లిలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అయితే నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాదంపై క్లూస్ టీం ఆధారాల సేకరిస్తుందని జాయింట్ డైరెక్టర్ వెంకన్న తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే పనిలో క్లూస్ టీం ఉందన్నారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాంపిల్స్ సేకరించామన్నారు. సేకరించినటువంటి శాంపిల్స్ అన్ని కూడా ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించేవే అన్నారు. 10 మందితో ఉన్న టీమ్ ఈ ప్రమాదంపై ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. సేకరించిన క్లూస్ ఆధారంగా ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ లేదా టపాసులు పేల్చడం వాళ్ల జరిగిందా తెలియాల్సి ఉందన్నారు. క్రాకర్స్ వలన కూడా ఈ ప్రమాదం జరిగిందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఈ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్ట్

నాంపల్లి అగ్ని ప్రమాదపు ఘటనలో తల్హా అనే యువకుడికి ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారని ఏసీపీ సంజయ్ తెలిపారు. మిగతా బాధితులు అంతా సేఫ్ గానే ఉన్నారన్నారు. అపార్ట్ మెంట్ యజమాని రమేష్ జైశ్వాల్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నారన్నారు. రమేష్ జైశ్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రమాద సమయంలో రమేష్ ఇక్కడే ఉన్నాడని ఏసీపీ సంజయ్ తెలిపారు. పొగ పీల్చడంతో అతడు సృహ కోల్పోయాడన్నారు. రమేష్ జైస్వాల్ బజార్ ఘాట్ లో ఉంటాడని, ఈ బిల్డింగ్ లో బిజినెస్ చేస్తున్నారన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే రమేష్ జైశ్వాల్ ను అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

సెల్లారులో కెమికల్ డబ్బాలు

నాంపల్లి బజార్ ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సెల్లార్ లోని రసాయనాల గోదాంలో మంటలు చెలరేగి నాలుగు అంతస్థుల భవనం మెుత్తం మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చిన్నారి సహా మెుత్తం 9 మంది మృత్యువాత పడ్డారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఫైర్ డీజీపీ నాగిరెడ్డి తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కెమికల్ డబ్బాలే అగ్ని ప్రమాదానికి కారణంగా కావొచ్చని ఆయన అన్నారు. భవన యజమాని రమేష్ జైష్వాల్‌గా గుర్తించామన్న ఆయన అపార్ట్ మెంట్ సెల్లార్ లో భారీగా కెమికల్ డబ్బాలు నిల్వచేసినట్లు తెలిపారు. రమేష్ జైష్వాల్‌కి ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమ ఉందని, ఆ ఇండస్ట్రీలో ఉపయోగించే కెమికల్ డబ్బాలను అపార్ట్ మెంట్ లో నిల్వ చేసినట్లు తెలిపారు. మెుత్తం 150కి పైగా కెమికల్ డబ్బాలను అపార్ట్ మెంట్ లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కెమికల్ డబ్బాలు ఒక్కసారిగా పేలి అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అనంతరం బిల్లింగ్ మెుత్తం వేగంగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు.

Whats_app_banner