Postal Packing centres : పోస్టల్ ఆధ్వర్యంలో మరిన్ని ప్యాకింగ్ కేంద్రాలు….-more postal packing centres will be formed soon in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Postal Packing Centres : పోస్టల్ ఆధ్వర్యంలో మరిన్ని ప్యాకింగ్ కేంద్రాలు….

Postal Packing centres : పోస్టల్ ఆధ్వర్యంలో మరిన్ని ప్యాకింగ్ కేంద్రాలు….

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 10:28 AM IST

Postal Packing centres ప్రైవేట్ కొరియర్ సంస్థలకు ధీటుగా బట్వాడా సేవల్ని విస్తరించేందుకు పోస్టల్ విభాగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్సిల్ విభాగాన్ని బలోపేతంచ చేసేందుకు సొంత కేంద్రాలను ఏర్పాటు చేస్తోన్న పోస్టల్ విభాగం హైదరాబాద్‌లో మరిన్ని ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

<p>పోస్టాఫీసుల్లో ప్యాకింగ్ కేంద్రాలు</p>
పోస్టాఫీసుల్లో ప్యాకింగ్ కేంద్రాలు (HT_PRINT)

Postal Packing centres సరుకు రవాణాపై పోస్టల్ విభాగం దృష్టి సారించింది. వివిధ విభాగాల్లో పోస్టల్ రవాణా సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరిన్ని పార్సిల్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఉత్పత్తిదారులకు , విక్రేతలకు వివిధ ప్రాంతాలకు తమ వస్తువుల్ని పంపేందుకు పోస్టల్ పార్సిల్ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పార్సిల్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖ త్వరలోని మరిన్ని ప్రాంతాల్లో ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

Postal Packing centres పార్సిల్ సేవల్ని విస్తరించే క్రమంలో ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు అనువుగా ఉండేందుకు హైదరాబాద్‌ చుట్టు పక్కల మరిన్ని ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పోస్టల్ శాక యోచిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సికింద్రబాద్‌, తిరుమల గిరి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌, హిమాయత్‌ నగర్‌లలో ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి.

తెలంగాణలో నల్గొండ, రామన్నపేట, హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, అదిలాబాద్‌, భద్రాచలంలోని పోస్టల్ కార్యాలయాల్లో 30 పార్సిల్ ప్యాకింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటిని మరిన్ని పెంచేందుకు పోస్టల్ శాఖ నిర్ణయించింది.

పోస్టల్ పార్సిల్ సర్వీసులPostal Packing centres ద్వారా పండుగ సమయాల్లో విదేశాలకు ఎక్కువగా పార్సిల్స్ వెళుతున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు విదేశాల్లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు పార్సిల్స్‌ ద్వారా వస్తువులు పంపుతున్నారు. హైదరాబాద్‌ జనరల్ పోస్టాఫీసు నుంచి ప్రతి నెల 500కు పైగా పార్సిల్స్‌ విదేశాలకు వెళుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు వెళుతున్నాయి.

Postal Packing centres ద్వారా వెళ్లే పార్సిళ్లలో దుస్తులు 60శాతం, పచ్చళ్లు, మందులు, పూజా సామాగ్రి వంటి వస్తువులు 10శాతం ఉంటున్నాయి. వరంగల్ నుంచి ప్రతి నెల 3వేల పార్సిళ్లలో ఆయుర్వేద మందులు విదేశాలకు వెళుతున్నాయి. పోచంపల్లి చీరలు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, కేరళా రాష్ట్రాలకు పంపుతున్నారు. పార్సిళ్లను రవాణాకు అనుగుణంగా ప్యాక్‌ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడం కోసం పోస్టాఫీసుల్లోనే ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటి వద్దకే డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. పోచంపల్లి చీరల్ని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు పంపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో డోర్ డెలివరీ కూడా అందిస్తున్నారు. పార్సిల్ ఎక్కడుందో కూడా కస్టమర్లు తెలుసుకునేలా ట్రాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే సురక్షితంగా, తక్కువ ధరకు పార్సిల్స్‌ పంపుకునే సౌలభ్యం పోస్టల్ పార్సిల్ సేవల్లో లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner