Gang rape case : జూబ్లీహిల్స్లో రేప్ కేసులో ఎమ్మెల్యే కుమారుడు
జూబ్లీహిల్స్లో బాలికపై అత్యచారం కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడంటూ వీడియోలు బయటికి రావటంతో.. అతడి పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చారు పోలీసులు.
జూబ్లీహిల్స్ రేప్ కేసులో దర్యాప్తు చేస్తుంటే.. రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. బాలిక స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేసిన పోలీసులు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని నిందితులుగా భావించారు.
అయితే బాలిక స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అనంతరం.. మరో నిందితుడిగా ఓ ఎమ్మెల్యే కుమారుడిని కూడా చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన బృందంతో సదరు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఈ అఘాయిత్యానికి ముందే వాహనం నుంచి దిగిపోయాడని పోలీసులు మెుదట తెలిపారు. ఐదుగురు నిందితుల్లో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు.
సాదుద్దీన్తోపాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఐదో నిందితుడైన ఉమర్ఖాన్ పరారీలో ఉండగా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అఘాయిత్యానికి ఉపయోగించిన రెండు కార్ల నుంచి క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే కారులో.. వీర్యనమూనాలు సేకరించారు. ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఫొటోలు, సీసీ కెమెరా దృశ్యాలను చూపిస్తూ కీలక సమాచారం సేకరించారు.
టాపిక్