Moula Ali Hill | ఇక్కడ తాళం వేస్తే కోరికలు నెరవేరుతాయట.. వెళ్తే హైదరాబాద్ మెుత్తం చూసేయోచ్చు-hyderabad tourist places moula ali dargah hyderabad s 400 years old shrine ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Moula Ali Hill | ఇక్కడ తాళం వేస్తే కోరికలు నెరవేరుతాయట.. వెళ్తే హైదరాబాద్ మెుత్తం చూసేయోచ్చు

Moula Ali Hill | ఇక్కడ తాళం వేస్తే కోరికలు నెరవేరుతాయట.. వెళ్తే హైదరాబాద్ మెుత్తం చూసేయోచ్చు

Anand Sai HT Telugu
May 01, 2022 03:54 PM IST

హైదరాబాద్ వచ్చేవారు.. ఏ ఏ ప్రదేశాలు తిరగాలా అని వెతుకుతుంటారు. భాగ్యనగరంలో నివాసించే వారు.. కూడా కుటుంబంతో కలిసి.. ఎక్కడకు వెళ్దామా అని వీకెండ్స్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్లు.. మౌలాలి దర్గాకు వెళ్తే.. మంచి వ్యూ కనిపిస్తుంది.

<p>మౌలాలి దర్గా నుంచి హైదరాబాద్ వ్యూ</p>
మౌలాలి దర్గా నుంచి హైదరాబాద్ వ్యూ

హైదరాబాద్ లో తిరిగేందుకు చాలా ప్రదేశాలు.. ఉన్నాయి. అయితే.. విద్యుత్ దీపాల వెలుగుల్లో హైదరాబాద్ నగరాన్ని చూడాలనుకునేవారికి.. బెస్ట్ ప్లేస్ మౌలాలి హిల్. ఇక్కడకు వెళ్తే.. భాగ్యనగర అందాలను.. వెలుగుల్లో చూసేయోచ్చు. అన్ని మతాలకు చెందిన సందర్శకులు రోజంతా దర్గాను సందర్శిస్తారు. కొండ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. టికెట్ ఏమీ ఉండదు. ఉదయం, సాయంత్ర పూట చాలా అందంగా కనిపిస్తుంది.

ఉప్పల్ నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో మౌలాలి హిల్ ఉంటుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి కూడా అంతే దూరం వస్తుంది. కొండంత ఏకశిలాతోనే ఉంటుంది. కింది నుంచి పై వరకూ.. వాహనంలో వెళ్లొచ్చు. అక్కడకు వెళ్లగానే.. మెట్లు కనిపిస్తాయి. 300 మెట్లు ఎక్కి మౌలా అలీ కొండపైకి వెళ్తారు. దాని మీద 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కోహ్-ఎ-మౌలా అలీ లేదా మౌలా అలీ దర్గా ఉంది.

దర్గాను అధికారికంగా హజ్రత్ అలీ ఇబ్నే-అబు తాలిబ్ అని పిలుస్తారు. దీనికి ప్రవక్త ముహమ్మద్ అల్లుడు హజ్రత్ అలీ పేరు పెట్టారు. ఆయన హస్తముద్రను మందిరంలో పూజిస్తారు. మౌలా అలీ కొండ మందిరం హైదరాబాద్‌కు ఉత్తరాన 10 మైళ్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 2,017 అడుగుల ఎత్తులో ఉంది. పగలు, రాత్రి సమయంలో పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

అన్ని మతాలకు చెందిన సందర్శకులు రోజంతా ఈ మందిరాన్ని సందర్శిస్తారు. సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని ఆస్వాదించేందుకు చాలా మంది వస్తుంటారు. విశాల హైదరాబాద్ నగరాన్ని ఇక్కడి నుంచి చూస్తూ.. ఎంజాయ్ చేయోచ్చు. పైన దర్గా ఉండటంతో ఎప్పుడూ.. జనాలు ఉంటూనే ఉంటారు. అయితే దర్గా ఎప్పుడూ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఒకప్పుడు ఈ పుణ్యక్షేత్రం నగర శివార్లలో వింతగా ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. 45 ఏళ్ల క్రితం తాను దర్గాను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు కొండ చుట్టుపక్కల అంతా మారిపోయిందని చరిత్రకారుడు మహ్మద్ సఫీవుల్లా చెప్పారు.

'నేను కేవలం ఎనిమిదేళ్ల వయసులో 1976లో ఈ మందిరాన్ని సందర్శించాను. నేను మా నాన్నతో కలిసి వెళ్ళాను. ఒకప్పుడు కొండపైకి వెళ్లినప్పుడు మనకు కనిపించేది వ్యవసాయ భూములు లేదా ఖాళీ భూములే. అప్పటికి పట్టణీకరణ ఇంతగా విస్తరించలేదు. మానవ నివాసం కూడా తక్కువే. కొండ కింద చిన్న చిన్న గుడిసెలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు కొండను ఆనుకుని కూడా ఇళ్లు కట్టేశారు.' అని మహ్మద్ సఫీవుల్లా చెప్పారు.

దర్గా సమీపంలో అనేక నివాస కాలనీలు పెరగడంతో కొండను నగరం మింగేసింది. ఇప్పుడు దర్గా ఒంటరిగా లేదు. ఎప్పుడు జనాలతో కనిపిస్తూనే ఉంటుంది. దర్గాలోకి ప్రవేశించినప్పుడు.. మధ్యలో ఒక మెటల్ నెట్‌తో పాటు తలుపులకు వేలాడదీయబడిన తాళాలు కనిపిస్తాయి. 'తాళం' వేయడం, దర్గా వద్ద ప్రార్థనలు చేయడం వల్ల అవి నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. వారి కలలు నిజంగా నెరవేరినట్లయితే.. భక్తులు తిరిగి వచ్చి తాళం తెరుస్తారని ఇక్కడ నమ్మకం.

చరిత్ర ప్రకారం.. కులీ కుతుబ్ షా రాజవంశం పాలనలో యాకూబ్ అనే మంత్రి మంచాన పడ్డాడు. హజ్రత్ అలీ కలలో అతనితో మాట్లాడి మౌలా అలీ శిల వద్దకు మార్గనిర్దేశం చేశాడు. మేల్కొన్న తర్వాత.. యాకూబ్ తనకు తాను కొత్తగా కనిపించాడు. అతను పుణ్యక్షేత్రానికి వెళ్లి.., కొండపైన హజ్రత్ అలీ చేతి ముద్రను గుర్తించాడు. ఈ ముద్రను కొండ పైభాగంలో, దర్గాలో ఉంచుతారు. కల ఆధారంగా, యాకూబ్ ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించిన హజ్రత్ అలీ చిత్రపటాన్ని కూడా గీశాడు. డ్రాయింగ్ ఇప్పటికీ దర్గా వద్ద భద్రపరచబడింది. దాదాపు 400 ఏళ్లపైనే చరిత్ర కలిగిన ప్రదేశం ఇది. 

Whats_app_banner