New Cable Bridge : హైదరాబాద్‌కు మరో కేబుల్ బ్రిడ్డి.. ఈసారి పెద్దగా.. బడ్జెట్ కూడా భారీగా..-hyderabad to get another cable stayed bridge at mir alam tank ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad To Get Another Cable Stayed Bridge At Mir Alam Tank

New Cable Bridge : హైదరాబాద్‌కు మరో కేబుల్ బ్రిడ్డి.. ఈసారి పెద్దగా.. బడ్జెట్ కూడా భారీగా..

HT Telugu Desk HT Telugu
Jul 19, 2022 04:31 PM IST

Mir Alam Tank Bridge: హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి రానుంది. మీర్ ఆలం బ్రిడ్జి నిర్మాణానికి వ్యయం కూడా భారీగానే అవనుంది.

కేబుల్ బ్రిడ్జి నమూనా
కేబుల్ బ్రిడ్జి నమూనా

Hyderabad Cable Bridge : ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ఐకానిక్ స్పాట్‌గా ఉంది దుర్గం చెరువు తీగల వంతెన. దీనిని 2020 సెప్టెంబర్‌లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పటికీ నగరంలో అత్యధికంగా ఫోటోలు తీసుకుంటున్నన ప్రదేశాలలో ఇది ఒకటి.

మరోవైపు మీర్ ఆలం ట్యాంక్ వంతెనను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. 2.5 కిలో మీటర్ల పొడవు, ఆరు లేన్లతో ఉంటుంది. దీని సెంట్రల్ స్పాన్ 350 మీటర్లు, పైలాన్లు 100 మీటర్ల ఎత్తు ఉంటుంది. డిమార్ట్-గురుద్వారా-కిషన్‌బాగ్-బహదూర్‌పురా క్రాస్‌రోడ్స్ మార్గంలో ప్రతిపాదించబడిన వంతెనతో ఈ వంతెన బెంగళూరు జాతీయ రహదారిని అత్తాపూర్ సమీపంలోని చింతల్‌మెట్‌తో కలుపుతుంది.

'ట్రాఫిక్‌ను సులభతరం చేయడం. చాలా మందికి అవాంతరాలు లేని ప్రయాణానికి భరోసా ఇవ్వడం కోసం ఈ వంతెన ఉపయోగపడుతుంది. వంతెన చూసేందుకు అద్భుతంగా ఉంటుంది." అని HMDA అధికారి ఒకరు తెలిపారు.

రద్దీగా ఉండే బెంగళూరు జాతీయ రహదారి-చింతల్‌మెట్ మార్గం చాలా కాలంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. మీర్ ఆలం ట్యాంక్ వంతెన పూర్తైతే.. ఈ ట్రాఫిక్ సమస్య ఇది తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ వంతెన ఓల్డ్ సిటీలో పర్యాటకాన్ని కూడా పెంచుతుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణకు సమస్యలు పెద్దగా రావనుకుంటున్నారు.

దుర్గం చెరువుపై ఉన్న 800 మీటర్ల కేబుల్‌ బ్రిడ్జికి రూ.184కోట్ల ఖర్చు అయింది. అయితే, ఈ మీర్ ఆలం ఈ బ్రిడ్జి నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని అంచనా వేశారు.

దుర్గం చెరువుపై ఉన్న 800 మీటర్ల కేబుల్‌ బ్రిడ్జికి రూ.184 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ లెక్కన చూసుకుంటే.. ఈ బ్రిడ్జి మరింత పెద్దగా ఉండనుంది. దీంతో .. ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది. ఇప్పటికే మొత్తం మూడు నమూనా డిజైన్లను రూపొందించారు. ఏదో ఒకటి సెలక్ట్ చేశాక... దాని ఆధారంగా.. వ్యయం ఉంటుంది.

మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం డీపీఆర్‌ రూపకల్పనను హెచ్‌ఎండీఏ చూసుకుంటోంది. గతేడాది టెండర్లను ఆహ్వానించారు. ప్రముఖ కన్సల్టెన్సీకి పనులు అప్పగించారు. జూపార్కు సమీపంలోనే ఈ కేబుల్‌ బ్రిడ్జి రానుంది. దీంతో ప్రత్యేక థీమ్‌ను రూపొందించాలని నిర్ణయించారు.

IPL_Entry_Point