Hyderabad Zero Shadow Day : హైదరాబాద్ లో నీడ మాయం, జీరో షాడో డేను మీరూ ఎక్స్‌పీరియన్స్ చేశారా?
Hyderabad Zero Shadow Day : హైదరాబాదీలు మా నీడ పోయిందని అంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు హైదరాబాదీల నీడ మాయమైంది. దీనినే జీరో షాడో డేగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Hyderabad Zero Shadow Day : ఓ తెలుగు సినిమాలో నా నీడ పోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు హీరో. ఇలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 12.12 గంటలకు రెండు నిమిషాల పాటు నీడ మాయమైపోయింది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది వాస్తవం. దీనిని సైంటిఫిక్ భాషలో జీరో షాడో డే అంటారు. రెండు నిమిషాల పాటు నీడ మాయమయ్యే అరుదైన ఘటన ఇది. ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే ఈ ఖగోళ అద్భుతానికి చోటుచేసుకుంటుంది.
భూమి, సూర్యుడు 90 డిగ్రీల పొజిషన్ లో
నీ నీడలా వెంటాడుతా.. అంటుంటారు. ఎప్పుడూ మన వెంటే ఉండే నీడలా నన్ను ఫాలో అవుతాను అనే ఉద్దేశంలో మాట్లాడుతుంటారు. సాధారణంగా మధ్యాహ్నం వరకు వెస్ట్ సైడ్, మధ్యాహ్నం తర్వాత ఈస్ట్ సైడ్ లో నీడ కనిపిస్తుంది. మిట్టమధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నడినెత్తికొచ్చినప్పుడు నిటారుగా ఉన్నా ఎంతో కొంత నీడ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఏడాదిలో రెండు సార్లు మన నీడ మనల్ని విడిచి వెళ్లిపోతుంది. దీనికి కారణంగా భూమి, సూర్యుడు 90 డిగ్రీల పొజిషన్ లోకి రావడమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ దృశ్యం ఇప్పుడు హైదరాబాద్ లో ఆవిష్కృతమైంది. మంగళవారం 12 గంటల 12 నిమిషాలకు సూర్యుడు నిట్టనిలువుగా వచ్చినప్పుడు రెండు నిమిషాల పాటు నీడ కనిపించలేదు. హైదరాబాద్ లో చాలా మంది ఈ విషయాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు.
మళ్లీ ఈ ఏడాది ఆగస్టు 18న జీరో షాడో డే
కర్కాటక రాశి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని తాకుతాయని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఈ ఘటన తర్వాతే ఉత్తరాయణం గతించి దక్షిణాయనం మొదలవుతుందని అంటుంటారు. కొంతమంది దీనినే భాస్కర్ జయంతి పేరుతో జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 18న జీరో షాడో డేను చూడొచ్చు. జీరో షాడో టైమ్‌లో ఏ వస్తువుపైన కానీ, మనిషిపైన కానీ సూర్య కిరణాలు పడినా నీడ కనిపించదు. దీన్నే టెక్నికల్ పరిభాషలో జెనిత్ పొజిషన్ అని పిలుస్తారు. దీన్నే జీరో షాడో డే గా చెబుతారు. ఏడాదిలో రెండుసార్లు ఈ ఫినామినన్ ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపించనుంది. జీరో షాడో టైమ్‌లో సూర్యుడి అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉండడం వల్ల నీడ కనిపించదు.