Hyderabad News : హైదరాబాద్ లో నామినేషన్లకు సర్వం సిద్ధం, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి - రోనాల్డ్ రాస్
Hyderabad News : హైదరాబాద్ జిల్లాల్లో నామినేషన్లు సమర్పించేవారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మాత్రమే సమర్పించాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సూచించారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
Hyderabad News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించే సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతి తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్,హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సూచించారు. సువిధ ఆప్ ద్వారా రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు అనుమతులు తీసుకోవాలని ఆయన కోరారు.
లౌడ్ స్పీకర్లకు అనుమతి తప్పనిసరి
సభలు,సమావేశాలు నిర్వహించే తేదీ, స్థలం, సమయం ఇతర వివరాలను స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని రోనాల్డ్ రోస్ తెలిపారు. లౌడ్ స్పీకర్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఎవరైనా సభకు ఆటంకం కలిగిస్తే పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలన్నారు. ప్రచారంలో పాల్గొనాలి అనుకునే కార్యకర్తలు, నేతలు ఐడెంటిటీ కార్డు లేదా గుర్తింపు బ్యాడ్జీలను ధరించాలన్నారు. రాజకీయ నాయకులు పంపిణీ చేసే ఓటరు స్లీప్ లో ఎలాంటి పార్టీ గుర్తు కానీ సింబల్ కానీ ఉండకూడదని రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఎన్నికల సంఘం పరిశీలకులకు, రిటర్నింగ్ అధికారికి, జోనల్, సెక్టార్ మేజిస్ట్రేట్ అధికారులకు ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు.
రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు
సభలు, సమావేశాల్లో ప్రజలను, కుల మతాలను రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేయొద్దని రోనాల్డ్ రోస్ ఆదేశించారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడొదన్నారు. అయితే హైదరాబాద్ జిల్లాల్లో నామినేషన్లు సమర్పించేవారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మాత్రమే సమర్పించాలన్నారు. అఫిడవిట్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు తప్పనిసరిగా అన్నీ కాలమ్స్ తప్పులు లేకుండా నింపాలని కోరారు. అభ్యర్థి నామినేషన్ తో పాటు ఎలెక్టోరల్ పేరు ఉన్న కాపీని జత చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సూచించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీ సంఖ్యలో బందోబస్తుగా నియమిస్తున్నారు. ఆర్వో కార్యాలయాల వద్ద శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించిన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో నామినేషన్ కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. ర్యాలీలు, సభల అనుమతులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమన్వయంగా ముందుకెళ్లాలని పోలీస్ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 15 నామినేషన్ కేంద్రాలు, రాచకొండలో 8 నియోజకవర్గాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.