Hyderabad Crime : కళ్లలో కారం కొట్టి కడుపులో కత్తిపోట్లు-ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. వివాహేత సంబంధంలో గొడవలు ఓ వ్యక్తి ప్రాణం తీశారు. ప్లాన్ ప్రకారం రప్పించి కళ్లలో కారం కొట్టి ఓ వ్యక్తిని హత్య చేశారు.
Hyderabad Crime : హైదరాబాద్ లోని ఉప్పల్(Uppal Murder) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కళ్లలో కారం చల్లి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. సికింద్రాబాద్(Secunderabad) ప్రాంతానికి చెందిన పుస్తకాల సాయికుమార్ (43) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ గా గత కొని రోజులుగా పనిచేస్తున్నాడు. గతంలో సాయి కుమార్ ఉప్పల్ ఆదర్శనగర్ లో నివాసం ఉండేవాడు. కాగా గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ఉప్పల్ జెన్ పాక్ట్ వద్దకు పిలిపించి తొలుత అతని కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం సాయి కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయి కుమార్ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే వివాహేతర సంబంధమే సాయి కుమార్ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఆదర్శ్ నగర్ లో నివాసం ఉన్న ఎలక్ట్రీషియన్ సాయి కుమార్ స్థానికంగా ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే గత కొంత కాలంగా సదరు మహిళ, సాయి కుమార్ మధ్య గొడవలు జరగడంతో... గత వారం రోజులుగా సాయి కుమార్ ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్లాన్ ప్రకారం ఆ మహిళ మాట్లాడుదాం అని సాయి కుమార్ ను ఉప్పల్ జెన్ పాక్ట్ వద్దకు పిలిపించి హత్య చేయించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి
విద్యుత్ షాక్ తో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల మృతి చెందిన విషాద ఘటన మహబూబ్ నాగర్ జిల్లా చిన్నాంతకుంట మండలం పరిధిలో చోటుచేసుకుంది. చిన్నంత కుంటలం మండలం పార్థివపురం గ్రామానికి చెందిన కర్ర మల్లన్న (50), మోహన్ రెడ్డి (56) వ్యవసాయ బావి వద్ద పాడైన మోటార్ రిపైరింగ్ పనులు చేస్తుండగా......ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఒకేసారి ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. అది గమనించిన పక్కన పొలాల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.....కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో పార్థివపూర్ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
కూతురుని వేధిస్తున్నాడని తండ్రి ఆత్మహత్య
ఓ యువకుడు తన కూతుర్ని వేధిస్తున్నాడని తెలిసి తీవ్ర మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాధ ఘటన వికారాబాద్ జిల్లా యలల మండల పరిధిలోని బెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమృతప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు నవీన్ అమృతప్ప కూతురుని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అమృతప్ప ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడు నవీన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం