Hyderabad Crime : హైదరాబాద్ ఫిలింనగర్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్, లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు సీజ్-hyderabad crime news in telugu police arrested drugs gang in film nagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ ఫిలింనగర్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్, లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు సీజ్

Hyderabad Crime : హైదరాబాద్ ఫిలింనగర్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్, లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు సీజ్

HT Telugu Desk HT Telugu
Dec 11, 2023 04:24 PM IST

Hyderabad Crime : విశాఖ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 310 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్,70 గ్రాముల చరిస్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ ముఠా అరెస్ట్
డ్రగ్స్ ముఠా అరెస్ట్

Hyderabad Crime : హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఓ డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. విశాఖ ఏజెన్సీలోని అరకు ప్రాంతంలో నిందితులు డ్రగ్ లిక్విడ్ లీటర్ కు రూ.80 వేలకు కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్ లో రూ.6 లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాలో సయ్యద్ ముజఫర్ అలీ, బిన్ అబ్దుల్ అజీజ్, ట్రాన్స్ పోర్టర్ మొహమ్మద్ ఖాసిం ఉన్నారు. వీరంతా ఒకే కాలేజీలో చదివి డ్రాప్ అవుట్ అయ్యారు. కామన్ మిత్రుల ద్వారా వీరందరూ తొలుత డ్రగ్స్ కు బానిసై ఆ తరువాత డ్రగ్స్ విక్రయాలు మొదలు పెట్టారు.

ఫిలిం నగర్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

ఆదివారం రాత్రి సమయంలో ఫిలింనగర్ లో గంజాయి సంబంధింత హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఒక మహిళతో పాటు మరో నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 310 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్,70 గ్రాముల చరిస్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఏపీని విశాఖపట్నం నగరానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

అరకులో కొనుగోలు హైదరాబాద్ లో విక్రయం

డ్రగ్స్ విక్రయం కంటే ముందు నిందితులంతా ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే వారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు సయ్యద్ అన్వరుల్ల హుస్సేన్, జీషన్ నవీద్ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. మొహమ్మద్ ఖాసిం విశాఖ అరకు ప్రాంతానికి వెళ్లి డ్రగ్స్, ఇతర డ్రగ్స్ సంబంధిత వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ముజఫర్ అలీ, అబ్దుల్ అజీజ్ కు ఇచ్చేవాడని, వారు ఇద్దరూ కలిసి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి 5 మి.లీ లిక్విడ్ కు రూ.3500కు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

పరారీలో మరో ఇద్దరు

అదుపులోకి తీసుకున్న నిందితులను తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫిలిం నగర్ పోలీసులకు అప్పగించారు. అలాగే పరారీలో ఉన్న ఇద్దరి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారులు అన్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner