Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో ఊరట
Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఆగష్టు 24న బండ్ల ఎన్నికల చెల్లిందంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈసీని ఆదేశించింది.
Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆగష్టు 24న హైకోర్టు విధించిన తీర్పుపై స్టే విధించింది. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది.
తాను గతంలో అమ్మేసిన ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్‌లో అసెట్స్‌లో చూపించాల్సిన అవసరం లేదని, అదే కారణంగా ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడినట్లు బండ్ల చెప్పారు.
తనకు నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రత్యర్థులు హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి చెప్పారు. తనకు 2018 ఎన్నికల్లో 28వేల ఓట్లతో మెజార్టీ లభించిందని చెప్పారు. ఎన్నికల ముందు మూడ్నెల్లకు ముందే భూముల్ని అమ్మేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని బండ్ల చెప్పారు. తన వాదన పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టులో తీర్పు వెలువడిందని చెప్పారు. తమ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు మార్గంలో కోర్టులో పిటిషన్లు వేశారని చెప్పారు.
డికె అరుణ ఎన్నికపై గెజిట్ జారీ…
మరోవైపు హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా గద్వాల ఎమ్మెల్యే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది.
మరోవైపు హైకోర్టు తీర్పును బండ్ల కృష్ణామోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాలు చేశారరు. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి గట్టి షాక్ తగలిందని భావించినా అనూహ్యంగా ఆయనకు ఊరట లభించింది. ఎన్నికల్లల తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై వేటు వేసింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరపిన హైకోర్టు ఆగష్టు 24న కీలక తీర్పును ఇచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చిన కృష్ణ మోహన్ ఎన్నికల చెల్లదని ప్రకటించింది. అంతేకాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ డీకే అరుణకు పిటిషన్ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.
2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,415 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న డీకే అరుణకు 72,155 ఓట్లు పోలయ్యాయి. సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలో ఉన్న అబ్జుల్ మోహిద్ ఖాన్ కు 7,189 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కృష్ణామోహన్ రెడ్డి 28,445 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
కొద్దిరోజుల కిందటే కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా కేసులో ఇదే తరహా తీర్పు వచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమాచారం ఇచ్చారంటూ ఆయన ఎన్నికను రద్దు చేసింది. సమీప ప్రత్యర్థిగా ఉన్న జలగంను ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు వనమా. హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోగా… విచారణ జరుగుతుంది. తాజాగా బండ్ల కృష్ణ