Nalgonda : సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, తండ్రి, కొడుకు సహా నలుగురు మృతి-four killed in road accident on sagar highway nalgonda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda : సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, తండ్రి, కొడుకు సహా నలుగురు మృతి

Nalgonda : సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, తండ్రి, కొడుకు సహా నలుగురు మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 20, 2023 05:38 PM IST

Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తండ్రికొడుకు ఉన్నారు.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టగా…. కారు రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు చనిపోయిన వారిలో ఉన్నారు.

yearly horoscope entry point

క్షతగాత్రులను దేవరకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆర్టీసీ బస్సు ప్రమాదం…

RTC Bus Accident at Mothkur : యాదాద్రి జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మోత్కురు - తిరుమలగిరి రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంగళవారం ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం - బోయలపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సు హైదరాబాద్‌ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ఒకరు మాత్రమే గాయపడినట్లు పోలీసులు చెప్పారు.

Whats_app_banner