Karimnagar Rains: అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం..తడిచిన ధాన్యంతో ఆందోళనలో రైతన్నలు-farmers are worried as the grain gets wet due to untimely rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Rains: అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం..తడిచిన ధాన్యంతో ఆందోళనలో రైతన్నలు

Karimnagar Rains: అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం..తడిచిన ధాన్యంతో ఆందోళనలో రైతన్నలు

HT Telugu Desk HT Telugu
May 08, 2024 09:40 AM IST

Karimnagar Rains: అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అయ్యింది. చేతికందిన పంట విక్రయానికి సిద్దంగా ఉండగా ఆకస్మత్తుగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది.

కరీంనగర్‌లో అకాల వర్షాలతో తడిచిన పంటలు
కరీంనగర్‌లో అకాల వర్షాలతో తడిచిన పంటలు

Karimnagar Rains: తడిచిన ధాన్యంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకొచ్చిన పంట నెలకొరిగి దాన్యం గింజలు రాలిపోవడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గాలివాన భీభత్సం సృష్టించింది. ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో వేలాది క్వింటాళ్ళ దాన్యం తడిసింది. కోతకు సిద్దంగా ఉన్న వరిపంట గాలివానకు నేలకొరిగి దాన్యం గింజలు రాలిపోయాయి.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 80శాతం వరికోతలు కాగ మిగిలిన 20 శాతం వరిపంట ఇంకా పొలాల్లోనే ఉంది. కోతకొచ్చిన పంట గాలివానకు నెలకొరికి అన్నధాతనకు కడగండ్లు మిగిల్చింది.

ఇక చేతికి అందిన పంట విక్రయించడానికి దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండగా ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షానికి దాన్యం తడిసి వరదకు కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోయే దాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడ్డారు.

తడిసి ముద్దైన దాన్యం చూసి రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం వల్ల హుస్నాబాద్, హుజురాబాద్, పెద్దపల్లి, మంథని, చొప్పదండి, మానకొండూర్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నధాలు కోరుతున్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు..మంత్రి పొన్నం ప్రభాకర్

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తరుగులేకుండా కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

వర్షంతో తడిసిన దాన్యంపై రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో దన్యాన్ని తరలించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరామని తెలిపారు. పంటనష్టాన్ని అంచనావేసి అధికారులు వెంటనే నివేధిక ఇవ్వాలని ఆదేశించారు.

మరో రెండు మూడు రోజులు వర్షాలు ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని దాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వడగళ్ళ వానకు పంటనష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు చేశామని ఎన్నికల కోడ్ తో రైతులకు పరిహారం అందలేదని త్వరలోనే పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు.

ఎన్నికల వేరు...ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు వేరని.. రైతుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందకుండా జరిగిన నష్టంపై అధికారులకు వివరాలు అందజేయాలని కోరారు.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గాలివానకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు గ్రామాలకు విద్యుత్ సప్లై నిలిచిపోయి అంధకారంగా మారాయి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్లలో భారీ వర్షంతో పాటు గాలిదుమారాని తాటి చెట్టు మధ్యలోకి విరిగిపడింది. విరిగిన తాటి చెట్టు విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభం గాలిలో వేళ్ళాడింది.

ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తిప్పింది. పవర్ సప్లై నిలిచిపోయి నంచర్లతోపాటు పలు గ్రామాలు అంధకారంగా మారాయి. ఈ సంఘటనను కొద్ది దూరంలో ఉన్న యువకులు తమ సెల్ ఫోన్ లో లైవ్ గా వీడియో చిత్రీకరించారు. గాలి వానకు తాటి చెట్టు మధ్యలో విరిగి కరెంట్ వైర్లపై పడి కరెంటు స్తంభం గాలిలో వేళ్ళాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

(రిపోర్టింగ్ కేవీరెడ్డి, కరీంనగర్)

Whats_app_banner

సంబంధిత కథనం