Karimnagar District : శెభాష్‌ రవీందర్... బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడిన దివ్యాంగుడు!-disabled person saved the old woman who jumped into the well in karimnagar district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar District : శెభాష్‌ రవీందర్... బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడిన దివ్యాంగుడు!

Karimnagar District : శెభాష్‌ రవీందర్... బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడిన దివ్యాంగుడు!

HT Telugu Desk HT Telugu
Mar 31, 2024 12:02 PM IST

Karimnagar district News: బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడాడు దివ్యాంగుడైన రవీందర్. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడిన దివ్యాంగుడు
బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడిన దివ్యాంగుడు

Karimnagar district News: కాలు పని చేయక కదలలేని స్థితిలో ఉన్నా... సాహసానికి అడ్డుకాదని నిరూపించాడు ఓ దివ్యాంగుడు. బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని కాపాడి శబాష్ అనిపించుకున్నాడు బండారి రవిందర్. వివరల్లోకి వెళ్తే…. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని వృద్ధురాలు గడ్డం మల్లీశ్వరి (70) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. బావి సమీపంలో నివాసముంటున్న దివ్యాంగుడు బండారి రవి భార్య గమనించి భర్తకు సమాచారం ఇచ్చింది. దివ్యాంగుడైన రవి కాలు కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఏ మాత్రం ఆలోచించకుండా బావిలోకి దూకేశాడు. నీటమునిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలు మల్లీశ్వరిని సేవ్ చేసి తన కాళ్లపై ఆమె తల పెట్టి కరెంటు మోటర్ బెల్టు సాయంతో నీటిలోని ఉండిపోయాడు. 20 నిమిషాల పాటు ఆమెను అలాగే కాపాడిన క్రమంల సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని వృద్ధురాలిని తాళ్ళ సాయంతో బయటకు తీశారు. చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధురాలు మల్లీశ్వరీ ఆరోగ్యంగా ఉన్నారు.

శెభాష్ రవిందర్…

బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలు చివరి నిమిషంలో తుది శ్వాస వదిలేస్తున్న క్రమంలో దివ్యాంగుడు చేసిన సహాసం అందరిని కదిలించింది. వృద్దురాలును ప్రాణాలతో కాపాడిన దివ్యాంగుడు బండారి రవిని స్థానికులతో పాటు అధికారులు అభినందనలతో ముంచెత్తారు. మానసిక స్థితి సరిగాలేకనే వృద్ధురాలు బావిలో దూకిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

K.Vijender Reddy, Karimnagar HT Telugu Correspondent

Whats_app_banner