Online Shopping | అట్లుంటది మనోళ్లతోని.. కరోనా తగ్గినా.. ఆన్‌లైన్ షాపింగ్ తగ్గేదేలే-covid on a decline but hyderabadis stick to online shopping know more details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Online Shopping | అట్లుంటది మనోళ్లతోని.. కరోనా తగ్గినా.. ఆన్‌లైన్ షాపింగ్ తగ్గేదేలే

Online Shopping | అట్లుంటది మనోళ్లతోని.. కరోనా తగ్గినా.. ఆన్‌లైన్ షాపింగ్ తగ్గేదేలే

HT Telugu Desk HT Telugu
May 30, 2022 06:56 AM IST

రెండు మూడు ఏళ్లుగా ఇండియాలో ఆన్ లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు.. నేరుగా గుమ్మం ముందుకు వస్తుంది. జనాలు దీనికే బాగా అలవాటు పడిపోయారు. ఇక హైదరాబాద్ లో అయితే ఇది మరి ఎక్కువ.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ-కామర్స్ లావాదేవీలు రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగాయి. మహమ్మారి కారణంగా అడుగు బయట పెట్టాలనే భయంతో ఇంట్లో నుంచి షాపింగ్ చేయడం మెుదలుపెట్టారు. క్రమంగా అది అలవాటైపోయింది. ప్రతిదీ కేవలం క్లిక్ దూరంలోనే ఉన్నందున.. ఇప్పుడు కూడా దుకాణాలను సందర్శించడం లేదు.

దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి భయాలు తగ్గిపోయాయి. కాననీ హైదరాబాద్‌ నగరవాసులు నేటి బిజీ లైఫ్‌లో తమ ఇళ్లకు డెలివరీ చేసే ఆన్‌లైన్ సేవలకు కట్టుబడి ఉన్నారు. పాలు, స్నాక్స్, కూరగాయలు, పండ్లు, కిరాణా సామాగ్రి, మందులు, రాత్రి భోజనం వరకు కావాల్సినవరి ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్‌లలో ఎక్కువ భాగం ఫుడ్ కోసమే చేస్తున్నారు. అల్పాహారం నుండి అర్ధరాత్రి భోజనం వరకు ఆన్ లైన్ మీదనే ఆధారపడుతున్నారు. పండగల సందర్భంగా ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ప్రత్యేకంగా క్లౌడ్ కిచెన్‌లను ఏర్పాటు చేస్తు్న్నారు.

రెండు సంవత్సరాలుగా నగరంలో ఇ-కామర్స్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఆన్‌లైన్ ఆర్డర్‌లలో ఎక్కువ భాగం కిరాణా సామనే ఉంటుంది. నగరంలోని వంద వరకు చిన్న, పెద్ద సూపర్ మార్కెట్‌లు వస్తువులను ఇంటికి డెలివరీ చేయడం ప్రారంభించాయి. స్టోర్‌ల వద్ద లైన్లలో వెయిటింగ్ చేయడం కంటే.. వినియోగదారులు ఆన్‌లైన్ లో తెప్పించుకోవడమే ఇష్టపడుతున్నారు. Big Basket, Dunzo, Reliance Mart, Amazon, Flipkart వంటి ప్రముఖ యాప్‌లు తాజా కిరాణా సామాగ్రిని కస్టమర్ల ఇంటి వద్దకే అందజేస్తున్నాయి. స్నాప్‌డీల్, మైంత్రా, ఇతర ఆన్‌లైన్ రిటైలర్లు బట్టలు, కొన్ని ఇ-స్టోర్లు తక్షణ డెలివరీని కూడా ప్రారంభించాయి.

ఆన్ లైన్ షాపింగ్ ఎంతలా పెరిగింది అంటే.. ఈ కామర్స్ సైట్లు సిబ్బంది సరిపోక.. రిక్రూట్ చేసుకుంటున్నారు. అమెజాన్ తన కార్యకలాపాలు మరింత విస్తృతం చేసేందుకు.. 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా తీసుకునే ఉద్యోగులను అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల్లోనూ, డెలివరీ నెట్వర్క్ కేంద్రాల్లోనూ నియమించనున్నట్టు అమెజాన్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగాల జాతర మెుదలైంది. గతంలో, కోచింగ్ సెంటర్లు పుష్కలంగా ఉన్న అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, అశోక్ నగర్‌లలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు వెళ్లేవారు. కానీ ఈ రోజు పరిస్థితి మారింది. చాలా కోచింగ్ సెంటర్‌లు ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నందున అనేకమంది ఇంటి నుండి కోచింగ్ తీసుకుంటున్నారు. T-SAT టీవీలో పాఠాలను ప్రసారం చేస్తోంది. జాబ్ ఆశించేవారు అమెజాన్ నుండి కోచింగ్ మెటీరియల్‌ని కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా జనాలు.. ఎక్కువగా ఆన్ లైన్ మీదనే ఆధారపడుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్