Godavarikhani Crime: గోదావరిఖనిలో కత్తిపోట్ల కలకలం, ఆస్తి వివాదంలో తమ్ముడిని పొడిచి చంపిన అన్న…-brother stabbed to death in godavarikhani brother stabbed to death in property dispute ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Godavarikhani Crime: గోదావరిఖనిలో కత్తిపోట్ల కలకలం, ఆస్తి వివాదంలో తమ్ముడిని పొడిచి చంపిన అన్న…

Godavarikhani Crime: గోదావరిఖనిలో కత్తిపోట్ల కలకలం, ఆస్తి వివాదంలో తమ్ముడిని పొడిచి చంపిన అన్న…

HT Telugu Desk HT Telugu
Jul 23, 2024 05:27 AM IST

Godavarikhani Crime: గోదావరిఖనిలో కత్తి పోట్లు కలకలం రేపాయి. తోడబుట్టిన తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడో అన్న. ఈ దాడిని అడ్డుకోబోయిన తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో తమ్ముడిని పొడిచి చంపిన అన్న
మద్యం మత్తులో తమ్ముడిని పొడిచి చంపిన అన్న

Godavarikhani Crime: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కత్తి పోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆస్తి విషయంలో అన్నదమ్ముల మద్య గొడవ ఒకరి ప్రాణాలు తీశాయి. తమ్ముడిపై అన్న దాడిని అడ్డుకోబోయిన తండ్రి కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గోదావరిఖని కృష్ణానగర్ లో నివాసం ఉండే ఆత్మకూరి అనిల్.. తండ్రి ఓదెలతో పాటు తమ్ముడు సునీల్ పై కత్తితో దాడి చేశాడు. ఆస్తి విషయంలో గొడవ పడ్డ అనిల్ మద్యం మత్తులో కత్త తో తమ్ముడు, తండ్రిలపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తమ్ముడు సునీల్ ప్రాణాలు కోల్పోయారు. తండ్రి ఓదెలకు తీవ్ర గాయాలు కాగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హత్యకు మద్యం మత్తు, ఆస్తి గొడవే కారణం…

అన్నదమ్ముల మధ్య గొడవకు ఆస్తి వివాదమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఆస్తి కోసం అన్న తల్లిదండ్రులతో గొడవ పడుతుండగా గొడవ ఎందుకని తమ్ముడు ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఉన్న అన్న అనిల్ కత్తితో దాడి చేసినట్లు మృతుని భార్య తెలిపారు.

తాగొచ్చి చంపుతా చంపుతా అని తండ్రిని బెదిరిస్తుండడంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావని తమ్ముడు ప్రశ్నించినందుకు కత్తితో ఇష్టం వచ్చినట్లు విచక్షణారహితంగా పొడిచి ప్రాణాలు తీశాడని బోరున విలపిస్తూ మృతుని భార్య చెప్పారు. ఇద్దరు చిన్నపిల్లలు తనకు దిక్కెవరిని కన్నీరుమున్నీరుగా విలపించారు.

రామగుండం మండలం పెద్దంపేటకు చెందిన అనిల్, సునీల్ బతుకుదెరువు కోసం ఇటీవలే మకాం గోదావరిఖనికి మార్చారు. ఇంటి వద్ద ఉన్న ఆస్థి విషయంలో అనీల్ తండ్రీ ఓదెలు తో గొడవపడ్డారు. ఆ గొడవను అడ్డుకునేందుకు వెళ్లినందుకు తన భర్తపే చంపాడు అని మృతుడి భార్య చెప్పారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఘటన స్థలాన్ని గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

(రిపోర్టింగ్ :కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner